
ఇరాన్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేస్తూ..
ఇరాన్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేస్తూ.. దేశ సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీకి లేఖ సమర్పించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సైన్యం ‘నిశ్శబ్ద తిరుగుబాటు’ (Quiet Military Coup d'état) కు పాల్పడిందని, ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అధికారాలన్నింటినీ లాగేసుకుందని పేర్కొంటూ పెజెష్కియాన్ తన రాజీనామా లేఖలో బాంబు పేల్చారు. వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వంలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అంతర్గత పోరు ఈ నిర్ణయంతో క్లైమాక్స్‌కు చేరింది. దేశంలోని కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయాలన్నింటి నుంచి తనను, తన మంత్రివర్గాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్లు పూర్తిగా పక్కనబెట్టారని అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏర్పడిన ఈ అధికార శూన్యతను ఆసరాగా చేసుకుని, ఐఆర్జీసీలోని కఠినతరమైన హార్డ్‌లైనర్ గ్రూపులు దేశ పరిపాలనను తమ గుప్పిట్లోకి తీసుకున్నాయని ఆయన ఆరోపించారు.సైన్యం చర్యలపై తీవ్ర అసంతృప్తిఇటీవల పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలు, యూఏఈ (UAE) పై జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల వెనుక ఐఆర్జీసీ మిలిటరీ నాయకత్వమే ఉందని పెజెష్కియాన్ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా లేకుండా సైన్యం ఇష్టారాజ్యంగా జరిపిన ఈ దాడులను ఆయన "కేవలం ఒక పిచ్చిచర్య (Madness)" గా అభివర్ణించారు. బాధ్యతారాహిత్యమైన ఇటువంటి చర్యల వల్ల దేశం కోలుకోలేని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు."ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో, రాజ్యాంగం నాకు