
యుద్ధరంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో ముందుంటున్న రష్యా, తాజాగా 'యోల్కా' అనే సరికొత్త యాంటీ-డ్రోన్ వ్యవస్థను ప్రయోగిస్తోంది.
శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి, వెంబడించి, నాశనం చేయగల ఈ హ్యాండ్‌హెల్డ్ సిస్టమ్‌ను రష్యా దళాలు ప్రస్తుతం యుద్ధ క్షేత్రంలో ఉపయోగిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇటీవల ఆన్లైన్లో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక సైనికుడు పిస్టల్ వంటి పరికరం నుంచి చిన్న ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను ప్రయోగించడం కనిపించింది.గతంలో 2025 మే నెలలో జరిగిన రష్యా విక్టరీ డే పరేడ్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమీపంలో ఉన్న ఒక భద్రతాధికారి చేతిలో ఈ కాంపాక్ట్ పరికరం తొలిసారిగా కనిపించింది. అప్పట్లో దీనిపై పెద్దగా స్పష్టత లేనప్పటికీ, ఇప్పుడు అధికారులు దానిని 'యోల్కా' వ్యవస్థగా నిర్ధారించారు.'యోల్కా' ఎలా పనిచేస్తుంది?ఈ వ్యవస్థలో ఒక సైనికుడు పిస్టల్ లాంటి లాంచర్ ద్వారా ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌ను గాల్లోకి ప్రయోగిస్తాడు. ప్రయోగించిన వెంటనే, ఈ ఇంటర్‌సెప్టర్ తనంతట తానుగా శత్రు డ్రోన్‌ను గుర్తిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కెమెరాలు, సెన్సార్ల సహాయంతో లక్ష్యాన్ని లాక్ చేసి, దానిని వెంబడిస్తుంది. చివరిగా, అత్యంత వేగంతో శత్రు డ్రోన్‌ను ఢీకొట్టి గాల్లోనే నాశనం చేస్తుంది. ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉండవు. కేవలం భౌతిక ఘాతంతోనే లక్ష్యాన్ని కూల్చేస్తుంది.'యోల్కా' ఇంటర్‌సెప్టర్ డ్రోన్ స్థూపాకారంలో, రెండు జతల 'ఎక్స్' ఆకారపు రెక్కలతో ఉంటుంది. ఈ రెక్కలు గాలిలో స్థిరంగా ప్రయాణించడానికి సహాయపడతాయి. వెనుక భాగంలో ఉండే చిన్న ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్లు దీని కదలికలను నియంత్రిస్తాయి.నివేదికల ప్రకారం, ఈ