నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Movie Reviews
  • Collections
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Collections
Reviews
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt

నర్మదా-క్షిప్రా పైప్ లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం

Andhra Jyothy1 Jun 2026, 2:13 am
Share
X
నర్మదా-క్షిప్రా పైప్ లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం

మధ్యప్రదేశ్: ఇండోర్-ఖండ్వా రహదారిపై భేరుఘాట్ సమీపంలో ఆదివారం నాడు వాటర్ పైప్‌లైన్ పగిలిపోవడం విధ్వంసానికి దారి తీసింది. మౌలో నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పగిలిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తుకు నీటి ధార ఆకాశంలోకి ఎగజిమ్మింది.

దీంతో నిమిషాల వ్యవధిలోనే పెద్దఎత్తున నీరు స్థానిక నివాసాల్లోకి ప్రవేశించింది. ఇళ్లలోని సామగ్రి పూర్తిగా తడిచిపోగా, మరికొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి. అటవీ శాఖ నర్సరీలో పని చేస్తున్న వాచ్‌మన్ ఇల్లు, బాబా ధాబాకు చెందిన రేకుల షెడ్డు బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

నీటి ఉధృతి ఎలా ఉందంటే.. వర్షాకాలంలో భారీ వరదలు సంభవించిన పరిస్థితి కనిపించింది. పైప్‌లైన్ నుంచి పెద్దఎత్తున నీరు బయటకు రావడంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పదుల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు గంటపాటు సాగిన ఈ విధ్వంసం తర్వాత అధికారులు పైప్‌లైన్‌కు నీటిని ఆపేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

కాగా, ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిని వరకు సాగే నర్మదా-క్షిప్రా ప్రాజెక్ట్‌లో ఈ పైప్‌లైన్ భాగమని స్థానికులు తెలిపారు. కొన్ని రోజులుగా పైప్‌లైన్ లీక్ అవుతోందని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయినా నిర్లక్ష్యం వహించి మరమ్మతుల విషయంలో జాప్యం చేశారని ఆరోపించారు.

తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇంతటి ప్రమాదం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని, నష్టపోయిన తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భారీ నీటి ధార, వరదకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వార్తలు కూడా చదవండి మనకు పౌర స్పృహ పెరగాలి: పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా జపాన్‌లో భారతీయ మహిళ చోరీ.. రెడ్ హ్యాండెడ్‌గా

మధ్యప్రదేశ్: ఇండోర్-ఖండ్వా రహదారిపై భేరుఘాట్ సమీపంలో ఆదివారం నాడు వాటర్ పైప్‌లైన్ పగిలిపోవడం విధ్వంసానికి దారి తీసింది. మౌలో నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పగిలిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తుకు నీటి ధార ఆకాశంలోకి ఎగజిమ్మింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే పెద్దఎత్తున నీరు స్థానిక నివాసాల్లోకి ప్రవేశించింది. ఇళ్లలోని సామగ్రి పూర్తిగా తడిచిపోగా, మరికొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి.


అటవీ శాఖ నర్సరీలో పని చేస్తున్న వాచ్‌మన్ ఇల్లు, బాబా ధాబాకు చెందిన రేకుల షెడ్డు బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నీటి ఉధృతి ఎలా ఉందంటే.. వర్షాకాలంలో భారీ వరదలు సంభవించిన పరిస్థితి కనిపించింది. పైప్‌లైన్ నుంచి పెద్దఎత్తున నీరు బయటకు రావడంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పదుల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు గంటపాటు సాగిన ఈ విధ్వంసం తర్వాత అధికారులు పైప్‌లైన్‌కు నీటిని ఆపేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిని వరకు సాగే నర్మదా-క్షిప్రా ప్రాజెక్ట్‌లో ఈ పైప్‌లైన్ భాగమని స్థానికులు తెలిపారు.


కొన్ని రోజులుగా పైప్‌లైన్ లీక్ అవుతోందని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయినా నిర్లక్ష్యం వహించి మరమ్మతుల విషయంలో జాప్యం చేశారని ఆరోపించారు. తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఇంతటి ప్రమాదం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరపాలని, నష్టపోయిన తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భారీ నీటి ధార, వరదకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

మనకు పౌర స్పృహ పెరగాలి: పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా

జపాన్‌లో భారతీయ మహిళ చోరీ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక..

Andhra Jyothyలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

రాష్ట్రంలో 2492 గ్రామాలలో ప్రజలకు మంచివార్త.. మీకోసమే ఈ ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్
Oneindia Telugu•19 Jun
నీట్ రీ-ఎగ్జామ్ పేప ర్ మ ళ్లీ లీక్ అయ్యిందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Asianet News Telugu•19 Jun
ప్యారడైజ్' నుంచి మరో విలన్.. కానీ అది మాత్రం
Sakshi•19 Jun
ఫుట్ పాత్ పై నడవడం ప్రాథమిక హక్కు
Eenadu•19 Jun
టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు
Sakshi•19 Jun
విష్ చేసిన స్టాలిన్ .. కలిసి పోరాడదామన్న రాహుల్
Eenadu•19 Jun

English Keywords

#indore-khandwa-pipeline-burst#bherughat-water-flood#narmada-kshipra-project-leak#pipeline-accident-india#water-damage-news#madhya-pradesh-flood#homes-damaged-water-pipeline#traffic-disruption-pipeline-burst#emergency-news-mp#telugu-news
నర్మదా-క్షిప్రా పైప్ లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం | nimisham.in