
Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) సినిమాలకు దూరమవుతుందని అంతా భావించారు. కానీ, పెళ్లి తరువాత ఆమె నటించిన ‘చీకటిలో’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. కానీ, ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు థియేటర్లలో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. శోభిత పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. Hellallallo Song: హెల్లల్లల్లో సాంగ్ పై తీవ్రమైన ట్రోలింగ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ అనే హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శోభిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో ఆమె పూర్తి బ్లాక్ డ్రస్‌లో, సరికొత్త పవర్ఫుల్ అవతారంలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. హిందీతో కెరీర్ ప్రారంభించి సౌత్ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న శోభిత, ఈ విభిన్నమైన సబ్జెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది
Telugu » Movies » Sobhita Dhulipala First Look Released From Pa Ranjith Vettuvam Movie
Sobhita Dhulipala First Look Released from pa ranjith vettuvam movie
Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) సినిమాలకు దూరమవుతుందని అంతా భావించారు. కానీ, పెళ్లి తరువాత ఆమె నటించిన ‘చీకటిలో’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. కానీ, ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు థియేటర్లలో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. శోభిత పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Hellallallo Song: హెల్లల్లల్లో సాంగ్ పై తీవ్రమైన ట్రోలింగ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ అనే హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శోభిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో ఆమె పూర్తి బ్లాక్ డ్రస్‌లో, సరికొత్త పవర్ఫుల్ అవతారంలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. హిందీతో కెరీర్ ప్రారంభించి సౌత్ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న శోభిత, ఈ విభిన్నమైన సబ్జెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.
10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.
Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.