
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌తో తొలి రెండు టీ20ల్లో విఫలమైన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (ShreyasIyer).. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడినా సరే.. దూకుడుగా ఆడాడు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో హాఫ్ సెంచరీ చేసిన టీమ్ఇండియా బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నప్పుడు శ్రేయస్ యాంకర్ పాత్ర పోషించాడు. శ్రేయస్ కెరీర్లో ఇదొక మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు.
‘‘శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆటతీరుపై ప్రశ్నలు లేవనెత్తినవారు ఈ ఇన్నింగ్స్ తర్వాత చాలా ఉపశమనం పొంది ఉంటారు. ప్లేయర్‌గా శ్రేయస్ దేని గురించీ ఆందోళన చెందక్కర్లేదు. అతడు ఈ ఫార్మాట్లో నిరూపించుకొన్న ఆటగాడు. అయితే, ఐర్లాండ్‌తో విఫలమైన తర్వాత.. చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కాబట్టే, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు అతడికి చాలా కీలకం. తొలి టీ20ల ఆడిన తీరు అద్భుతం. ఆరంభంలోనే రెండు వికెట్లు పడిన తర్వాత.. దూకుడుగా ఆడే అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మరీ ఎక్కువగా సిక్స్‌లపై ఆధారపడకుండా యాంకర్ పాత్ర పోషించాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవంతో ప్రతి భారత క్రికెటర్ సిక్స్‌లు కొట్టేందుకే అలవాడి ఉంటాడు. దాన్నుంచి శ్రేయస్ బయటపడ్డాడు. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ.. కేవలం ఫోర్లతోనే స్కోరు బోర్డును నడిపించాడు. అందుకే అతడి కెరీర్లో ఇది మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ అని చెబుతా’’ అని పార్థివ్ తెలిపాడు.
‘‘వైభవ్ సూర్యవంశీకి తప్పకుండా ఈ సిరీస్‌లో అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అయితే, ఇక్కడ సరైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం. కోచింగ్ స్టాఫ్‌గా అది వారిపై ఉన్న బాధ్యత. అతడిని ఆడించడం లేదని ముందే చెప్పాలి. 15 ఏళ్ల పిల్లాడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని పార్థివ్ తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మాంచెస్టర్: ఇంగ్లాండ్‌తో రెండో టీ20 ఆడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్‌తో సహా ప్రతి క్రికెటర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ఫొటోలను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఈ చిత్రాలు మీ కోసం..