
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ అల్లర్ల కేసు (Delhi riots case 2020)లో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్ (Umar Khalid), షర్జీల్ ఇమామ్‌కు దిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది.
వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు గుర్తుచేసింది. అసలు వీరి బెయిల్ దరఖాస్తులు కూడా విచారణకు యోగ్యమైనవి కాదని.. అందువల్లే వాటిని కొట్టివేస్తున్నామని వెల్లడించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే (Delhi riots case). ఆ అల్లర్లలో దాదాపు 53 మంది మృతి చెందగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద ఛార్జిషీట్ నమోదు చేశారు. అనంతరం ఐదుగురు నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖాలిద్, ఇమామ్‌కు మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మహారాష్ట్రలో జోరు వానలు కొనసాగుతున్నాయి. భివాండీ, ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
పుదుచ్చేరిలో వారసత్వ కట్టడం పర్యాటకులను ఆకర్షిస్తోంది. 190 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఓల్డ్ లైట్‌హౌస్’ అందుబాటులోకి వచ్చింది.