
బాలీవుడ్లో నటి సెలీనా జైటీ (Celina Jaitly) మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. 15 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె పూర్తిస్థాయి పాత్రతో వెండితెరపై కనిపించనున్నారు.
బాలీవుడ్లో నటి సెలీనా జైటీ (Celina Jaitly) మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. 15 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె పూర్తిస్థాయి పాత్రతో వెండితెరపై కనిపించనున్నారు. 2011లో ఉపేంద్ర హీరోగా వచ్చిన కన్నడ చిత్రం ‘శ్రీమతి’లో ఆమె కథానాయికగా నటించారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏ సినిమాలో కనిపించలేదు. తదుపరి 2012లో ‘హూ విల్ మ్యారీ మీ’ చిత్రంలో గెస్ట్ రోల్ కనిపించారంతే! స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్ నివేదిత బయోపిక్‌తో (Sister Nivedita Biopic) ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఏక్ దువా’ షార్ట్‌ఫిల్మ్‌తో జాతీయ పురస్కారం అందుకున్న రామ్‌కమల్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 15 ఏళ్ల పాటు ఐరోపాలో గడిపిన సెలీనా ఇప్పుడు తన మూలాలను వెతుక్కుంటూ మాతృదేశానికి తిరిగి వచ్చానట్లు చెప్పారు. సనాతన ధర్మంతో అనుసంధానమయ్యానన్నారు. స్వామి వివేకానందా ఆధ్యాత్మిక జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఆయన బాటలో నడిచిన నివేదిత పాత్రను పోషిస్తుండటంపై సెలీనా జైట్లీ ఆనందం వ్యక్తం చేశారు.
ఐర్లాండ్‌లో 1867లో జన్మించిన సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ నోబెల్. 1895లో స్వామి వివేకానందను బోధనలకు ఆకర్షితురాలై ఇండియాకు వచ్చారు. 1898లో వివేకానందుడి శిష్యరికాన్ని స్వీకరించి సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. 43 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు.
దీని గురించి సెలీనా జైట్లీ మాట్లాడుతూ ‘నా కెరీర్‌కి ఇదొక అర్థవంతమైన చిత్రంగా మిగిలిపోతుంది. బాల్యంలో నా తల్లి ద్వారా సిస్టర్ నివేదిత సేవలు గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు తెరపై ఆమె పాత్ర పోషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదొక మరుపురాని అనుభవం.
Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా
Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..
ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా