
పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తీవ్ర సందిగ్ధంలో చిక్కుకున్నాడు. దేశం తరఫున ఆడాలా? లేక భారీ మొత్తానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఫ్రాంచైజీ లీగ్‌లో పాల్గొనాలా?
అనే క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఒకవైపు పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం, మరోవైపు భారత యజమాని ఆధ్వర్యంలోని జట్టుతో ఉన్న ఆర్థిక ఒప్పందం అతడిని గందరగోళంలో పడేశాయి.ఏమిటీ వివాదం?పాకిస్థాన్ జట్టు త్వరలో వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయాలని పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. అయితే, అదే సమయంలో యూకేలో 'ది హండ్రెడ్' లీగ్ జరగనుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ అబ్రార్‌ను ఏకంగా 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.3 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ యజమాని సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ-యజమాని అయిన కావ్య మారన్.'ది హండ్రెడ్' లీగ్ జులై 21న ప్రారంభం కానుండగా, వెస్టిండీస్‌తో పాకిస్థాన్ తొలి టెస్టు జులై 25 నుంచి మొదలవుతుంది. ఈ రెండు టోర్నీల తేదీలు దాదాపు ఒకేసారి రావడంతో అబ్రార్ ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ టెస్ట్ జట్టుకు ఎంపికైతే, అతను 'ది హండ్రెడ్' లీగ్‌కు దూరం కావాల్సి వస్తుంది.కావ్య మారన్ నిర్ణయంతోనే అసలు సమస్యగతంలో 'ది హండ్రెడ్' వేలంలో కావ్య మారన్ పాకిస్థాన్ ఆటగాడైన అబ్రార్‌ను కొనుగోలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. 2008 ముంబై దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు