
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో, భారత మార్కెట్లో తన విజయవంతమైన మోడల్ క్విడ్ 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.52 లక్షలుగా నిర్ణయించింది.
ఈసారి కంపెనీ కస్టమర్ల కోసం వేరియంట్ల సంఖ్యను సరళీకరించి, కేవలం ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు ప్రధాన వేరియంట్లలోనే ఈ కారును అందుబాటులోకి తెచ్చింది.వేరియంట్ల వారీగా ధరలను పరిశీలిస్తే, ఎవల్యూషన్ మాన్యువల్ (ఎంటీ) ధర రూ. 4.52 లక్షలు, ఆటోమేటిక్ (ఏఎంటీ) ధర రూ. 4.89 లక్షలుగా ఉంది. ఇక టాప్ మోడల్ అయిన క్లైంబర్ మాన్యువల్ ధర రూ. 5.14 లక్షలు కాగా, ఏఎంటీ ధర రూ. 5.60 లక్షలుగా ఉంది. ప్రత్యేకంగా క్లైంబర్ వేరియంట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి కంపెనీ రూ. 15,000 క్యాష్ బెనిఫిట్ అందిస్తోంది. దీంతో దీని ప్రభావవంతమైన ధర రూ. 4.99 లక్షలకు తగ్గుతుంది.ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్లో ప్రధానంగా రెనో కొత్త బ్రాండ్ లోగోను పొందుపరిచారు. ఎస్యూవీ తరహా డిజైన్‌ను కొనసాగిస్తూనే చిన్నపాటి స్టైలింగ్ మార్పులు చేశారు. క్లైంబర్ వేరియంట్లో ప్రత్యేకంగా రగ్డ్ స్టైలింగ్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంజన్ విషయంలో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించింది. ఇది 69 బీహెచ్పీ శక్తిని, 91 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో 8-అంగుళాల