
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని సాహెబ్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 2019 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన ఫైరింగ్‌లో డాక్టర్ అర్చనా గుప్తా మృతిచెందిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
2018 డిసెంబరు 31న అర్ధరాత్రి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో రాజుకుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఆయన గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ టైమ్‌లో అక్కడే ఉన్న డాక్టర్ అర్చనా గుప్తా(45) తలకు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారామె. ఈ ఘటనపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గత జూన్‌లో రాజుకుమార్ సింగ్‌ను బీఎన్ఎస్-304(2) సహా ఆయుధ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని దోషిగా తేల్చింది.
అయితే.. శిక్షను ఖరారు చేసే సమయంలో రాజుకుమార్ సింగ్‌కు ఎలాంటి హత్యోద్దేశం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి పేరుండటంతో శిక్షను తగ్గించాలని కూడా కోర్టును కోరారు. అయితే.. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పు రాజుకుమార్ సింగ్ రాజకీయ భవిష్యత్తుపై ఏమేర ప్రభావం చూపుతుందనే విషయం చర్చనీయాంశమైంది.
'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు
బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు