
TS Police Jobs: గతంలో 2015, 2018, 2022లో భారీగా నియామకాలు జరిగిన నేపథ్యంలో, ఈ తాజా ప్రకటనతో నిరుద్యోగుల ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది.
శాంతిభద్రతల బలోపేతమే లక్ష్యంగా ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీస్, జైల్, అగ్నిమాపక, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లోని ఈ ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ అనుమతులు లభించిన వెంటనే రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. గత కొంతకాలంగా నిరుద్యోగులు మరియు అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్పై చేస్తున్న డిమాండ్లు, ఆందోళనల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హోమ్ శాఖ