
ఇంటి నిర్మాణంలో మెట్ల మార్గానికి వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. మెట్లు అనేవి కేవలం పై అంతస్తుకు వెళ్లే దారే కాదు, అవి ఇంట్లోని ఎనర్జీని ఒక ఫ్లోర్ నుండి మరో ఫ్లోర్కు చేరవేసే ప్రధాన వంతెనలు.
ఇంటి నిర్మాణంలో మెట్ల మార్గానికి వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. మెట్లు అనేవి కేవలం పై అంతస్తుకు వెళ్లే దారే కాదు, అవి ఇంట్లోని ఎనర్జీని ఒక ఫ్లోర్ నుండి మరో ఫ్లోర్‌కు చేరవేసే ప్రధాన వంతెనలు. అందుకే మెట్ల గోడకు కిటికీలు పెట్టేటప్పుడు వాస్తు నియమాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాలి.కిటికీలు పెట్టడం వాస్తు రీత్యా ఎందుకు మంచిది?పూర్వ కాలంలో మెట్ల మార్గంలో కిటికీలు పెట్టేటప్పుడు కొన్ని సందేహాలు ఉండేవి. కానీ, ఆధునిక వాస్తు ప్రకారం మెట్ల దారిలో గాలి, వెలుతురు పుష్కలంగా ఉండటం చాలా అవసరం. చీకటిగా, ఇరుకుగా ఉండే మెట్ల మార్గం ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది. పగటిపూట సూర్యరశ్మి నేరుగా మెట్లపై పడటం వల్ల అక్కడ ఎలాంటి క్రిమికీటకాలు చేరవు. ఆ ప్రాంతమంతా సానుకూల శక్తితో నిండిపోతుంది. కాబట్టి మెట్ల గోడకు కిటికీలు పెట్టడం వాస్తు ప్రకారం చాలా ఉత్తమం.vastu tips: వాస్తు ప్రకారం పూజ గదిలో కలకత్తా మార్కెట్’ పెట్టొద్దు!కిటికీల సంఖ్య, సైజు నియమాలుసరిసంఖ్య నియమం: వాస్తు శాస్త్రంలో కిటికీలు, తలుపుల సంఖ్యకు ఒక లెక్క ఉంది. మెట్ల గోడకు పెట్టే కిటికీల సంఖ్య ఎప్పుడూ సరిసంఖ్యలో అంటే 2 లేదా 4 ఉండేలా చూసుకోవాలి. బేసి సంఖ్యలో (1, 3 లేదా 5) పెట్టడం అంత మంచిది కాదు.దిక్కును బట్టి సైజుఒకవేళ మీ మెట్ల మార్గం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటే, అక్కడ పెద్ద సైజు కిటికీలు పెట్టుకోవచ్చు. అదే మెట్లు పడమర లేదా దక్షిణం వైపు ఉంటే, అక్కడ కిటికీల సైజు కాస్త చిన్నదిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే పడమర, దక్షిణ దిక్కుల నుండి వచ్చే తీవ్రమైన సాయంత్రపు ఎండ నేరుగా ఇంట్లోకి రాకుండా ఉండటం మంచిది.vastu tips: ఏ అంతస్తులో ఫ్లాట్ అద్దెకు తీసుకుంటే మంచిది?ల్యాండింగ్ వద్ద కిటికీలుచాలా ఇళ్లలో మెట్లు సగం ఎక్కాక మలుపు తిరుగుతాయి. ఈ ల్యాండింగ్ ప్లేస్‌లో పెద్ద కిటికీలు లేదా గ్లాస్ విండోస్ పెట్టడం ఈమధ్య ట్రెండ్ అయింది. వాస్తు ప్రకారం ఇది చాలా మంచి పద్ధతి. ల్యాండింగ్ వద్ద కిటికీ ఉండటం వల్ల ఇటు కింది ఫ్లోర్‌కు, అటు పై ఫ్లోర్‌కు సమానంగా వెలుతురు అందుతుంది.ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలుమెట్ల కింద వద్దు. కిటికీలు ఎప్పుడైనా మెట్లు ఎక్కే గోడకు లేదా పైన ఉండాలి కానీ, మెట్ల కింద ఉండే ఖాళీ స్థలంలో కిటికీలు పెట్టకూడదు. పగిలిన అద్దాలు ఉండకూడదు. ఒకవేళ కిటికీలకు గ్లాస్ ఉపయోగిస్తే, అవి ఎప్పుడూ పగలకుండా, నీట్‌గా ఉండాలి. దుమ్ము పట్టిన లేదా పగిలిన కిటికీలు ఉంటే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఓపెనింగ్ స్టైల్. కిటికీ తలుపులు ఎప్పుడూ లోపలికి లేదా పైకి తెరుచుకునేలా ఉంటే మంచిది. వీలైతే స్లైడింగ్ విండోస్ కూడా వాడుకోవచ్చు. మెట్ల గోడకు కిటికీలు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. పైగా, అవి సరిసంఖ్యలో ఉంటూ.. ఇంటికి మంచి వెలుతురును అందిస్తే వాస్తు రీత్యా అది ఆ ఇంటో ఉండే వారికి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.