
నటుడు, నిర్మాత మంచు విష్ణు తను ఎంతో ప్రెస్టేజియ్ గా నటించి, నిర్మించిన కన్నప్ప సినిమాపై సంచలన ప్రకటన చేశారు. ఈసినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ భక్తిరస చిత్రాన్ని పూర్తి నిడివితో అధికారిక యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అది కూడా పూర్తి ఉచితంగా ఈసినిమాను చూడవచ్చు. దీంతో వారాంతంలో కుటుంబ సభ్యులు, భక్తులు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించింది.
శివభక్తుడు కన్నప్ప జీవన గాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించగా, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కన్నప్ప సినిమా గత ఏడాది జూన్ 2025లో థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది కానీ అనుకున్నంత కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా 2026 జూన్ 27న పరిమిత సంఖ్యలో కొన్ని థియేటర్లలో ఈ కన్నప్పను రీరిలీజ్ చేశారు.
తాజాగా, జూలై 3 నుంచి ఏవీఏ ఎంటర్టైన్మెంట్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో కన్నప్ప పూర్తి చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులో ఉంచారు. దీంతో వివిధ భాషల ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించే అవకాశం పొందుతున్నారు.డిజిటల్ ల ద్వారా పౌరాణిక, భక్తి ప్రధాన చిత్రాలను ఎక్కువగా ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.