
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే కూటమి - వైసీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ ని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు ముందస్తుగానే కసరత్తు మొదలు పెట్టారు.
అటు మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికల అంశాల పైన స్పష్టత ఇస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలోకి రానున్నాయి. ఈ రెండు సీట్లు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది.ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ పోరు రోజుకో మలుపు తీసుకుంటోంది. కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. వైసీపీ హయాం లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబుల పదవీ కాలం జూలై 27తో ముగియనుంది. ఇప్పటికే జకియా ఖానమ్ బీజేపీకి దగ్గరయ్యారు. ఇక.. ఈ రెండు స్థానాలు టీడీపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పలువురు టీడీపీ నేత లకు ఎమ్మెల్సీ స్థానాల పైన హామీ ఇచ్చారు. రాజ్యసభ.. ఎమ్మెల్సీ పదవులను ఇప్పటి వరకు అయిన ఖాళీల ను భర్త చేసారు. అయితే, పిఠాపురం వర్మ .. వంగవీటి రాధ కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో, తాజాగా వర్మ తో పాటుగా వంగవీటి రాధాకు కు ఇచ్చే పదవి పైన టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో సీట్లు దక్కని సీనియర్లు రేసులోకి వచ్చారు.ఏపీలో ఓటు -హైదరాబాద్‌లో ఉద్యోగం.. SIRలో నమోదు ఎక్కడ.. ఎలా..!?అవకాశం దక్కేది ఎవరికి..?డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ గా కొద్ది రోజుల క్రితమే వర్మను బాధ్యతల నుంచి తప్పించారు. 2024 ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. పవన్ కు భారీ మెజార్టీ రావటం లో వర్మ క్రియాశీలకంగా పని చేసారు. పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. కాగా, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవటం పైన ఆయన మద్దతు దారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్పుడు మారుతున్న రాజకీయ లెక్కల వేళ వర్మతో పాటుగా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. 2019 నుంచి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ సీటు పై హామీ పెండింగ్ లో ఉంది. దీంతో, ఈ రెండు స్థానాలు ఈ ఇద్దరికీ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే.. మాజీ మంత్రులు.. 2024 లో హామీ పొందిన పలువురు సీనియర్లు రేసులో ఉండటంతో పాటుగా బీజేపీ, జనసేన నుంచి ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లెక్కల వేళ చివరగా కూటమి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.