
భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో కచ్చితంగా రాణిస్తాడని శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
అయితే, అంత చిన్న వయసులోనే అతనిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడి పెంచవద్దని అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న వాస్, 'ఐఏఎన్ఎస్'తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు."భారత్ ఎన్నో ఏళ్లుగా ప్రపంచస్థాయి యువ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తోంది. కొత్త సంచలనం సూర్యవంశీ వయసు చాలా చిన్నది. అతనికి టీమిండియాకు ఆడే అవకాశం వస్తుందని, అద్భుతంగా రాణిస్తాడని నాకు నమ్మకం ఉంది. కానీ, ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే, అతనిపై ఎలాంటి ఒత్తిడి పెట్టొద్దు. అతడిని స్వేచ్ఛగా ఎదగనిస్తే, భారత క్రికెట్‌కు గొప్ప విజయాలు అందిస్తాడు" అని వాస్ వివరించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సూర్యవంశీ, 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, అంతకుముందు ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతనికి ఆడే అవకాశం రాలేదు.తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) నిర్వహణపై వాస్ ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి టోర్నమెంట్లు యువ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నాడు. "హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారిగా తెలంగాణ టీ20 లీగ్ నిర్వహించడం యువతకు చాలా మంచిది. అన్ని జట్లలోనూ ఎంతో