
గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ...
గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేశారు.
విజయవాడ, జులై 4 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కేసుకు (Gade Sai Krishna case) సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త ఈరోజు (శనివారం) హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులపై విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే చంపేసి, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు.
కృష్ణలంక పోలీసుస్టేషన్లో తన కుమారుడు సాయికృష్ణ ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లామని ఆయన తల్లి విజయలక్ష్మి తెలిపారు. అయితే, అప్పటి సీఐ నాగరాజు తన కుమారుడిని చూడనీయకుండా వెనక్కి పంపించారని అన్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని విచారణాధికారిని విజయలక్ష్మి వేడుకున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా మెజిస్టీరియల్ విచారణ కొనసాగింది. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర, నిష్పాక్షిక విచారణ అవసరమని డిమాండ్ చేశారు. ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, మెజిస్టీరియల్ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు కీలకంగా మారనున్నాయి.
వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు
నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News