ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన సంగతి తెలిసిందే. రూ. 10 లక్షలలోపు విలువైన వ్యవసాయ భూమిని స్టాంపుడ్యూటీగా రూ. 100కే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఒకవేళ రూ. 10లక్షల పైన ఉంటే రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. తాత, తండ్రి, తల్లి మరణం తర్వాత వ్యవసాయ భూములు వారసుల పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావడం లేదు.. వారసులకు పాస్‌పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ మేరకు వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం వారసత్వ భూముల మ్యుటేషన్‌కు సంబంధించి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.వారసత్వ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌తోనే ఆటో మ్యుటేషన్ మరింత సులభతరం చేసేలా విధానాన్ని అమల్లోకి తెస్తుంది. వారసత్వంగా వచ్చిన కుటుంబ సభ్యుల ఆస్తుల విభజన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌తో వెంటనే మ్యుటేషన్లు చేస్తారు. వారసత్వ భూములకు సంబంధించి ఎఫ్ఎంసీ (కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం) ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మ్యుటేషన్ చేసేవారు. ఆ తర్వాత మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగేవారు. ఇకపై వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని కుటుంబసభ్యులు విభజించుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయగానే ఆటోమ్యుటేషన్ పూర్తిచేసి రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ఎంటర్ చేస్తారు. అయితే వీలునామా రాయకుండా తాత, తండ్రి, తల్లి చనిపోతే.. ఆ వారసులు మాత్రం ఆస్తుల పంపిణీ దస్తావేజుల రిజిస్ట్రేషన్ సమయంలో ఎఫ్ఎంసీ సమర్పించాలి.వారసత్వ భూములకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆస్తులు పంచుకున్నాక, సచివాలయాల్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) పెట్టి దరఖాస్తు చేసుకునేవారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితే రికార్డుల్లో పేరు మారేది కాదు. ఇకపై ఆస్తుల పంచుకుని రాసుకున్న వీలునామా దస్తావేజులను సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే.. ఆటోమేటిక్‌గా వారసుల పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో 'ఆటో-మ్యుటేషన్' జరిగిపోతుంది.వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ. 10లక్షల వరకు ఉంటే స్టాంపు డ్యూటీ రూ. 100 మాత్రమే. ఒకవేళ రిజిస్ట్రేషన్ విలువ రూ. 10లక్షలకు మించితే స్టాంప్ డ్యూటీ రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం గతేడాది తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు ఊరట దక్కింది. వారికి పట్టాదారు పాసుపుస్తకాలతో హక్కులు వస్తాయి. కుటుంబ పెద్ద ఆస్తులకు వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తుల్ని భార్య, పిల్లలు విభజించి పంపిణీ చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా మ్యుటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.