యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిడిక్ గుణాలు శరీర దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్చీరియాను చంపేస్తాయి. దీంతో శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది.
దీనికోసం వెనిగర్, నీళ్లు సమపాళ్లలో తీసుకుని స్ప్రే బాటిల్లో నింపండి. దీనిని చెమట ఎక్కువగా పట్టే చంకలు, శరీరంపై స్ప్రే చేసుకుంటే చాలు. దుర్వాసన రాకుండా ఉంటుంది.
చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసి చెమటను పీల్చుకోవడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. దీనికోసం బేకింగ్ సోడాలో కొద్దిగా కార్న్ స్టార్చ్ కలిపి చెమట ఎక్కువగా వచ్చే చోట పౌడర్ లాగా చల్లుకుంటే సరిపోతుంది.
గ్రీన్ టీలో ఉండే టానిన్స్ యాంటీ పెర్సిపిరెంట్ లాగా పనిచేసి చెమటను తగ్గిస్తాయి. అలాగే దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం గ్రీన్ టీ తయారుచేసి మిగిలిన టీ బ్యాగ్‌ను చల్లారాక చంకల్లో రాసుకుంటే మంచిది.
కొబ్బరి నూనెలో లౌరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సూక్ష్మక్రిములను చంపి చంకల్లో, శరీరంపై వచ్చే దుర్వాసనను తగ్గిస్తుంది. దీనికోసం కొబ్బరి నూనెను చెమట వాసన వచ్చే చోట రాసుకుంటే చాలు. లేదంటే బేకింగ్ సోడా కలిపి కూడా రాసుకోవచ్చు.
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మం పీహెచ్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచుతుంది. తద్వారా చర్మంపై వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. దీనికోసం నిమ్మరసాన్ని కాటన్ బాల్ సహాయంతో మీ చంకల్లో, చెమట వచ్చేచోట రాసుకుంటే చాలు.
టీ ట్రీ ఆయిల్లో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను చంపేసి దుర్వాసన రాకుండా చూస్తాయి. దీనికోసం కొబ్బరి నూనెలో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాసుకుంటే సరిపోతుంది.
మెంతుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం మెంతులను మరిగించి టీ చేసుకుని తాగితే శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది.
శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగండి. అలాగే క్లోరోఫిల్ లభించే ఆకుకూరలు తీసుకోండి. దీంతో పాటు దుర్వాసనకు కారణమయ్యే ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి.
చెమట వాసన ఎక్కువగా వచ్చే వారు సువాసనభరిత సోప్ బదులు యాంటీ బ్యాక్టీరియల్ సోప్ వాడటం మంచిది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నివారించి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.