
20 ఏళ్ల రాజకీయ జీవితంపై ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ పోస్టు పెట్టారు. మిడ్జిల్‌లో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘రెండు దశాబ్దాల ప్రజాజీవితం మరపురాని మధుర జ్ఞాపకం.
రేవంత్‌రెడ్డిగా మొదలైన ప్రయాణం.. రేవంతన్నగా నిలిచే స్థాయికి చేరింది. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ప్రతి సందర్భం, సంఘటన, సంఘర్షణలో అండగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు’’ అని రేవంత్ తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితం.. రేవంత్ భావోద్వేగ పోస్ట్ |