తెలుగు చలనచిత్ర సీమలో నందమూరి బాలకృష్ణ ఒక తిరుగులేని కథానాయకుడు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా వెండితెర అరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ,...
తెలుగు చలనచిత్ర సీమలో నందమూరి బాలకృష్ణ ఒక తిరుగులేని కథానాయకుడు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా వెండితెర అరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, పవర్ఫుల్ నటనతో మాస్ ప్రేక్షకులకు ఆయన గాడ్‌గా మారారు. బాలయ్య సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించగల సత్తా ఆయన సొంతం. అయితే ఈ నటసింహం సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అంచనాలతో ప్రారంభమై, రకరకాల కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఎదురైన కొన్ని నాటకీయ పరిణామాలు ఈ ప్రాజెక్టుల నిలిపిపోవడానికి కారణమయ్యాయి. బాలయ్య కెరీర్లో పట్టాలెక్కి ఆగిపోయిన ఆ ఆసక్తికరమైన చిత్రాల విశేషాలు ఇక్కడ చూద్దాం.నటరత్న1986లో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల సందర్భంగా 'నటరత్న' అనే వైవిధ్యమైన టైటిల్‌తో పత్రికల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల, నిర్మాత జి. సుబ్బారావు కలయికలో అమెరికా వేదికగా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు చిత్ర బృందానికి వీసాలు రావడంలో తీవ్ర ఆలస్యమైంది. దీనితో బాలయ్య డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే కథలో కొన్ని మార్పులు చేసి, హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో 'చిన్ని కృష్ణుడు' పేరుతో ఆ సినిమాను పూర్తి చేశారు.* 'నాగబంధం'లో అబ్దాలీ విధ్వంసం.. రిషబ్ సాహ్నీ విలనిజానికి థియేటర్లు షేక్ శపథం (3D చిత్రం)'బాబాయ్ అబ్బాయ్' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకుడు క్రాంతి కుమార్ పర్యవేక్షణలో 'శపథం' అనే సినిమాను ప్లాన్ చేశారు. అప్పట్లో టాలీవుడ్లో 3D చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ ట్రెండ్‌ను అందుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా కథను కూడా సిద్ధం చేశారు. కానీ ఊహించని సాంకేతిక, వ్యక్తిగత కారణాల వల్ల క్లాప్ కొట్టే లోపే ఈ క్రేజీ 3D ప్రాజెక్ట్ మూలపడింది. బాలకృష్ణుడు'అశోక చక్రవర్తి' సినిమాను నిర్మించిన కోగంటి హరికృష్ణ, ఆ తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా 'బాలకృష్ణుడు' అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో బాలయ్య నటించిన 'అశోక చక్రవర్తి', వెంకటేష్ నటించిన 'ధ్రువ నక్షత్రం' సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వచ్చాయి. ఆ రెండు చిత్రాల కథాంశాలు దాదాపు ఒకేలా ఉండటంతో బాలకృష్ణ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హరికృష్ణతో చేయాల్సిన 'బాలకృష్ణుడు' ప్రాజెక్ట్‌ను ఆయన రద్దు చేసుకున్నారు.* నిర్మాత బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. జూబ్లీహిల్స్ ఆస్తి వేలాన్ని సమర్థించిన తెలంగాణ హైకోర్టు వి. సముద్ర దర్శకత్వంలో కమాండో చిత్రం2002లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రారంభమైంది. పరుచూరి బ్రదర్స్ మాటలు అందించగా, వి. సముద్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దేశభక్తి, ప్రేమ, కుటుంబ సెంటిమెంట్ కలగలిసిన ఈ కథలో బాలయ్య ఒక పవర్ఫుల్ కమాండో పాత్రలో కనిపించాల్సింది. మార్చి 8న లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, కొద్దిరోజుల షూటింగ్ జరుపుకున్నాక అంతర్గత కారణాలతో ముందుకు సాగలేదు. విక్రమసింహ భూపతిఒకప్పుడు భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అంటే బాలకృష్ణకు హోమ్ బ్యానర్ లాంటిది. 'మాతో పెట్టుకోకు' చిత్రం తర్వాత ఈ సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి బాలయ్యతో 'విక్రమసింహ భూపతి' అనే పీరియాడిక్ జానపద చిత్రాన్ని ప్రారంభించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజుగా, యోధుడిగా ద్విపాత్రాభినయం చేశారు. రోజా, పూజా బాత్రా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఆ సమయంలో హీరో, నిర్మాత మధ్య తలెత్తిన కొన్ని అభిప్రాయభేదాల కారణంగా సినిమా శాశ్వతంగా ఆగిపోయింది. నర్తనశాలపౌరాణిక పాత్రలన్నా, అద్భుతమైన డైలాగ్స్ చెప్పాలన్నా బాలకృష్ణకు ఎంతో ఇష్టం. తన తండ్రి ఎన్టీఆర్ క్లాసిక్ మూవీ 'నర్తనశాల'ను అదే పేరుతో రీమేక్ చేస్తూ బాలయ్యే స్వయంగా మెగాఫోన్ పట్టారు. ఇందులో అర్జునుడిగా బాలకృష్ణ, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి, ద్రౌపదిగా సౌందర్య ఎంపికయ్యారు. వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా షూటింగ్ కూడా సాగింది. అయితే ఆ వెంటనే బాలకృష్ణ ప్రమాదానికి గురికావడం, మరోవైపు సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. 16 సంవత్సరాల తర్వాత, ఆ వారం రోజుల్లో తీసిన ఫుటేజ్‌ను ఎడిట్ చేసి బాలకృష్ణ ఒక షార్ట్ ఫిల్మ్‌గా ఓటీటీలో విడుదల చేసి అభిమానుల ముచ్చట తీర్చారు.హర హర మహాదేవ'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహ నాయుడు' వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన బి. గోపాల్-బాలయ్య కాంబినేషన్లో 2011లో 'హర హర మహాదేవ' చిత్రం అనౌన్స్ అయింది. గతంలో 'లక్ష్మీ నరసింహ' వంటి హిట్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ దీనికి నిర్మాత. అయితే ఆ సమయంలో బాలకృష్ణ నివాసంలో జరిగిన ఒక కాల్పుల వివాదంలో నిర్మాత బెల్లంకొండ గాయపడటం సంచలనంగా మారింది. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత మళ్లీ సినిమాను ప్రారంభించాలనుకున్నా, ఓపెనింగ్ రోజున ఒక వినైల్ పోస్టర్ (కమల్ హాసన్ 'దశావతారం' పోస్టర్‌పై బాలయ్య ముఖాన్ని మార్ఫింగ్ చేయడం) అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ వరుస వివాదాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లకుండానే మూతపడింది. ఇలా నటసింహం కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ, తెర వెనుక మిగిలిపోయిన ఈ చిత్రాల గాథలు కూడా టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఆసక్తికరమైన పేజీలుగానే నిలిచిపోతాయి.