
Siddu Pawan:యూట్యూబ్ సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్, సోనియా సింగ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 1:45 గంటలకు తమ పెళ్లి జరగనున్నట్లు సోనియా స్వయంగా వెల్లడించారు.
యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్, సోనియా సింగ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ అనుబంధాన్ని పెళ్లితో మరింత బలపరచుకునేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న సోనియా సింగ్ స్వయంగా తమ పెళ్లి తేదీని ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.
కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న సోనియాను మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నించగా, మొదట సరదాగా ఏమో.. ఇప్పటికే పెళ్లైపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో అంటూ నవ్వులు పూయించారు. అనంతరం అసలు విషయాన్ని వెల్లడిస్తూ, సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు తమ వివాహం జరగనుందని చెప్పారు. దీంతో ఈ జంట పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆనందం నెలకొంది.
సోనియా సింగ్ యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా నటిగా మంచి పేరు సంపాదించారు. రౌడీ బేబీ, హే పిల్ల వంటి యూట్యూబ్ కంటెంట్‌తో పాపులర్ అయిన ఆమె, విరూపాక్ష సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో మెప్పించారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కామెడీ పాత్రతో ఆకట్టుకోగా, ఇటీవల విడుదలైన నాగబంధం సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు.
ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి అడిగిన ప్రశ్నలకు కూడా సోనియా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీ ఫోటోలు, వీడియోలు చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా?" అని అడగగా, అవన్నీ అందరికీ ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి అంటూ చమత్కరించారు. అలాగే కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ, తెలిసిన వాళ్లు నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుడతారని చెప్పారు. అది నిజమవుతుందో లేదో తెలియదు కానీ, ఆ రోజుకోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చెప్పారు.
సిద్ధూతో కలిసి కొనుగోలు చేసిన ఆస్తులపై వస్తున్న ప్రచారాలకూ సోనియా క్లారిటీ ఇచ్చారు. గత ఏడాది ఇద్దరూ కలిసి ఒక ఇల్లు, బెంజ్ కారు కొనుగోలు చేశామని, అయితే అవన్నీ ఈఎంఐలపైనే తీసుకున్నామని తెలిపారు. తమపై వస్తున్న అనవసర రూమర్లకు కూడా ఈ సందర్భంగా ఫుల్స్టాప్ పెట్టారు. ఇప్పుడు ఈ జంట పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.