
రెండువారాల పాటు సమస్యలు ఈపీఎఫ్‌వో వెల్లడి అందుబాటులోకి వచ్చిన మెంబర్, ఎంప్లాయర్ పోర్టల్ సేవలు ఈనాడు, హైదరాబాద్: పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ వంటి క్లెయిమ్‌ల పరిష్కారం ఆలస్యం కానుంది.
సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌లో భాగంగా సేవలకు సాధారణం కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. నూతన సాఫ్ట్వేర్ సాధారణ స్థితికి చేరుకునే వరకు... కనీసం రెండు వారాల పాటు క్లెయిమ్‌ల పరిష్కారం నిర్ణీత గడువు కన్నా ఆలస్యమవుతుందని వివరించింది. ఈ మేరకు చందాదారులు సహకరించాలని కోరింది. సాఫ్ట్వేర్ ఉన్నతీకరణ, మెరుగైన ఆటోమేషన్, కనీస నిల్వ, ఇతర ప్రయోజనాల కోసం జూన్ 26 నుంచి ఈపీఎఫ్‌వో సర్వర్లను నిలిపివేసింది. జులై 1 నుంచి కొత్త పోర్టల్‌లు అందుబాటులోకి వస్తాయని ప్రకటించినా, సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. శుక్రవారం నుంచి ఈపీఎఫ్, ఈపీఎస్-2026 పథకాలకు అనుగుణంగా ఆధునికీకరించిన మెంబర్, ఎంప్లాయర్ పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్‌బుక్ సేవల సాఫ్ట్వేర్ ఉన్నతీకరణ ఇంకా కొనసాగుతోందని, తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. రద్దీ సమయాల్లో తరచూ వెబ్సైట్ ఓపెన్ చేయవద్దని ఖాతాదారులను కోరింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.