
వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లు వెంటనే ప్రారంభించాలని.. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్‌లో పాల్గొనాలన్నారు.
అమరావతి, జులై 3: వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు(శుక్రవారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లు వెంటనే ప్రారంభించాలని.. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్‌లో పాల్గొనాలన్నారు. పొగాకు రిజెక్షన్ రేటును కచ్చితంగా తగ్గించాలని ఆదేశించారు. కంపెనీలు సిండికేట్ అయి, మంచి బేల్స్పైనా సీలింగ్ పెట్టి ధరలు తగ్గిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సిండికేట్ నిర్ధారణ అయితే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డ్‌కు సూచించారు. అన్ని గ్రేడ్ల పొగాకును కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్నారు. కొనుగోళ్లపై టొబాకో బోర్డు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
టొబాకో బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును ఆక్షన్‌కు తీసుకురావాలని... తద్వారా మంచి ధర లభిస్తుందని, రిజెక్షన్ రేటు తగ్గుతుందని మంత్రి తెలిపారు. టొబాకో బోర్డు, బ్యాంకర్లతో చర్చించి పొగాకును నిల్వ ఉంచాలనుకునే రైతులకు రుణాలు అందిస్తామన్నారు. రైతులకు న్యాయమైన ధర వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పొగాకు రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని తేల్చిచెప్పారు. ఆక్షన్‌లో పాల్గొనని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని బోర్డును ఆదేశించారు.
సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పొగాకు ఆక్షన్ ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలిస్తున్నారని.. సిండికేట్ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డ్ ప్రతినిధులకు సూచిస్తున్నారని తెలిపారు. పొగాకు కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు సహించమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా ఎస్బీవీ స్వామి, టొబాకో బోర్డు ఛైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి
మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు