
AP Education Fee Hike: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఫీజుల నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫీజుల నియంత్రణ కమిటీకి చైర్పర్సన్ నియామకం ఆలస్యమవడంతో కొత్త ఫీజుల ఖరారు
ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులకే 10 శాతం పెంపు చేసి కొనసాగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉన్నత విద్యా కోర్సుల ఫీజులను సవరించే విధానం అమల్లో ఉంది. అయితే కమిటీ ఏర్పాటులో జాప్యం కారణంగా బీటెక్‌తో పాటు ఇతర డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల అడ్మిషన్లకు అంతరాయం కలగకుండా తాత్కాలికంగా పాత ఫీజులపై 10 శాతం పెంపుతో కొనసాగించే అవకాశాలను ఉన్నత విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలో అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.