
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Siya Goyal Middle Finger Video: తన కాబోయే భర్తను చంపిన సియా గోయల్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించకపోవడంతో, సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ప్రవర్తించిన వీడియో చర్చనీయాంశమైంది. విచారణ కోసం పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన ఈ ఘటనపై, హత్య చేసినా ఆమెకు ప్రశాంతత లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎక్స్ (X) వేదికగా 17 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. పూనేలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న తన ఇంటికి పోలీసులు ఆమెను తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు టీ షర్ట్, ముఖానికి మాస్క్ ధరించిన సియా, ఒక్కసారిగా మీడియా వైపు చూసి మిడిల్ ఫింగర్ చూపించింది. తన అహంకారాన్ని బయట పెట్టింది. దీంతో నెట్టింటా సియాను ఏకిపారేస్తున్నారు. కాబోయే భర్తను చంపినా పొగరు తగ్గలేదు అని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. పూనే బిజినెస్మెన్ కేతన్ అగర్వాల్ మృతి కేసును మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు, ఆ తర్వాత ఇది పక్కా పథకం ప్రకారం కాబోయే భార్య చేసిన హత్య అని నిర్ధారించారు. సియా తన లవర్ చేతన్‌తో కలిసి కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసి ప్రాణాలు తీసింది. మొదట విచారణలో తప్పుడు సమాధానాలు చెప్పిన ఆమె, పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది.
చేతన్‌ను ప్రేమించడమే కాకుండా, కేతన్కు జుట్టు లేదు, అతను విగ్గు పెట్టుకునేవాడు, నత్తి కూడా ఉంది. అందుకే నచ్చలేదని, తన కుటుంబం ఆ విషయాలను పట్టించుకోలేదని ఆమె చెప్పిందట. కుటుంబ సభ్యులను బాధ పెట్టడం కంటే అతడిని చంపడం సులువు అని ఆమె భావించినట్టు సమాచారం.
Read more: సియా గోయల్ ఇచ్చిన సిగ్నల్ అదేనా.!. పూణె మర్డర్ కేసులో బైటపడ్డ షాకింగ్ నిజం..!
Read more: పూణె మర్డర్ కేసులో కీలక పరిణామం.. లోహగఢ్ కోటకు సియా గోయల్, చేతన్ చౌదరీ... ఎందుకో తెలుసా..?.
ఈ సంచలన హత్య కేసుపై నేటిజన్లు కేతన్కు సానుభూతి వ్యక్తం చేశారు. పెళ్లి నచ్చకపోతే చంపేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. హత్యకు నాలుగు రోజుల ముందే సియా అతడిని అదే లోయలోకి తోసి చంపడానికి ప్రయత్నించినట్లు కేతన్ తండ్రి ఆరోపించారు. బయటకు పాము వచ్చిందని భయపడి ఆమె నాటకం ఆడిందని, కేతన్ చనిపోయాక ఎమోషనల్ పోస్టులు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, సియా, కేతన్ కలిసి ఆనందంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి కోసం రాజస్థాన్‌లో రూ.16 కోట్ల లగ్జరీ వేడుకను బుక్ చేసినట్లు తెలుస్తోంది. కేతన్ కుటుంబం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా సియా కేతన్ కుటుంబం వీరి పెళ్లిని నవంబర్‌లో ఫిక్స్ చేశారు. ఇక కేతన్, సియా రిలేషన్షిప్ పై ఆమె ప్రియుడు చేతన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరు పన్నాగం పన్ని కేతన్ ని హతమార్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.