
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Gajalaxmi Rajayogam 2026 Effect Telugu: ఖగోళంలో గ్రహాల కదలికలు మానవ జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతూ ఉంటాయి.. ఈ క్రమంలో జూలై 2 గురువారం రోజు ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడింది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవగురువు బృహస్పతి, శుక్రుడు, బుధ గ్రహాల అనుకూల ప్రభావం వల్ల అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీనికి తోడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశిస్తూ.. మకర రాశిలో సంచారం చేసింది.. సూర్యుడి నుంచి చంద్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల సమయోగం కూడా ఏర్పడింది. ఈ అరుదైన గ్రహాల కూటమి కారణంగా 5 రాశుల వారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ధనలాభాలు కలగడమే కాకుండా.. వృత్తిపరమైన విజయాలు చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ధన లాభాలు: వృషభ రాశి (Taurus) వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ రాశి నుంచి మూడవ స్థానంలో శుక్ర, గురువుల ప్రభావం వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందం విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరైతే వారి ఆత్మవిశ్వాసం, ధైర్యమైన నిర్ణయాల వల్ల విజయాలు కలుగుతాయి.
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని గుర్తింపును అందిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా మారుతుంది. ఆదాయం పెరిగినప్పటికీ.. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగం మారాలనుకునే వారికి అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
తులా రాశి (Libra) తులా రాశి వారికి ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా.. శుభప్రదంగా సాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్లో పురోగతి సాధించడానికి అదృష్టం లభిస్తుంది.. మానసిక ఆందోళనలు, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఊహించని విధంగా ధనలాభం కలగడంతో పాటు, ఆత్మీయుల నుంచి విలువైన బహుమతులు కూడా పొందుతారు. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మకర రాశి (Capricorn) చంద్రుడు మకర రాశిలోనే సంచరిస్తుండటంతో పాటు అతనిపై గురు, బుధ, శుక్రుల శుభ దృష్టి ఉండటం వల్ల ఈ రాశి వారికి విశేష ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ ఆలోచనలు పదును పెరిగి.. కొత్త ప్రణాళికలతో విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటాయి.. ప్రేమ జీవితం, వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో శృంగారభరితంగా.. సంతోషంగా సాగుతుంది.
మీన రాశి (Pisces) మీన రాశి వారికి ఈ రాజయోగం కఠిన శ్రమ చేయడం వల్ల అద్భుతమైన విజయాలు కూడా పొందుతారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని వనరుల ద్వారా ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.