
నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ‘‘జూన్ ఫెయిరీ టేల్లా గడిచింది’’ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
వాటిలో బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె పోస్ట్‌కు నటి అనన్య పాండే స్పందిస్తూ ‘సామ్’ అని కామెంట్ చేసింది.సమంత షేర్ చేసిన ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిత్రాలు, పెంపుడు శునకాలతో గడిపిన క్షణాలు, ప్రకృతి అందాలు, వెల్నెస్ ట్రిప్, ఇష్టమైన పుస్తకాలు, రోజువారీ జీవితంలోని మధుర క్షణాలు కనిపించాయి. కొన్ని ఫొటోల్లో ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించారు.ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్లో సమంత కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం ప్రసూతి సెలవు తీసుకుంటానని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాతో అభిమానుల ముందుకు వస్తానని చెప్పింది.ఇటీవల జరిగిన సినిమా విజయోత్సవ వేడుకల్లో సమంత కనిపించిన ఫొటోలు, వీడియోలతో ఆమె గర్భవతి అని తొలిసారి బయటకు వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్లో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత వివాహం చేసుకుంది.