
బ్యాంకాక్: ఈశాన్య థాయ్‌లాండ్‌లో తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకొంటూ వెళుతున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్కు దూసుకురావడంతో 9 మంది మృతిచెందినట్లు గురువారం అధికారు
లు తెలిపారు. బ్యాంకాక్‌కు 600 కి.మీ.ల దూరంలోని ముక్దహాన్ ప్రావిన్సుకు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరి వెనుక మరొకరు వరుసగా నడిచి వెళుతుండగా శరవేగంతో వచ్చి అదుపు తప్పిన ట్రక్కు క్షణాల్లో అందరినీ చెల్లాచెదురు చేసింది. ఈ ప్రమాదంలో అయిదుగురు సాధువులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. గాయాలతో చికిత్స పొందుతున్న 13 మంది సాధువుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాలుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.