
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్, టాలీవుడ్లో ఇటీవల ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంపై, అందులో సమంత నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరి విజయాన్ని మరొకరు గౌరవించుకోవడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. తన ‘లెనిన్’ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఇంకా పూర్తిగా చూడలేదని అఖిల్ తెలిపారు. అయితే, ఆ సినిమా ట్రైలర్ చూశానని, దాని వైబ్ అద్భుతంగా ఉందని అన్నారు. "ట్రైలర్ చూడగానే ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఒక మంచి కోడలు తన అత్తారింటి మనసులు గెలుచుకోవాలనే సున్నితమైన ఫ్యామిలీ పాయింట్‌కు, పవర్ఫుల్ యాక్షన్‌ను జోడించి చాలా సహజంగా తెరకెక్కించారు" అని చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు.ముఖ్యంగా ఒక మహిళా ప్రధాన పాత్రతో అంత భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం గొప్ప విషయమని అఖిల్ కొనియాడారు. ఈ చిత్రంలో సమంత తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా "కంగ్రాట్స్ సామ్" అంటూ సమంతకు, చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా తన అభినందనలు తెలియజేశారు.నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అక్కినేని కుటుంబ సభ్యులతో సమంతకు, ముఖ్యంగా అఖిల్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధం, వృత్తిపరమైన గౌరవం మరోసారి బయటపడింది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు అందరినీ