
ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్, తమ సంస్థలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కేవలం రూ.
186 విలువైన కుకీని దొంగిలించాడనే నిందతో 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. అయితే, ఆ ఉద్యోగి తన నిజాయతీని నిరూపించుకుని, కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించి, అంతకంటే మెరుగైన ఉద్యోగంలో చేరి యాజమాన్యానికి షాక్ ఇచ్చారు.అసలేం జరిగిందంటే..!కెంటకీలోని ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న 60 ఏళ్ల కుర్ట్ క్రోమ్, గతంలో వారానికి సగటున 60 గంటలు పనిచేసేవారు. ఆయన వార్షిక జీతం సుమారు $200,000 (దాదాపు రూ. 1.9 కోట్లు). ఒకరోజు పని మధ్యలో రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడంతో ఫ్యాక్టరీలోని క్యాంటీన్ కియోస్క్‌లో 1.95 డాలర్ల విలువైన కుకీ కొనుక్కుని తిన్నారు.అయితే, కొద్దిసేపటికే తనను ఆఫీస్‌కు పిలిపించిన అధికారులు, యూనియన్ ప్రతినిధి సమక్షంలో "నువ్వు కుకీ దొంగిలించావు. అందుకు వీడియో సాక్ష్యం ఉంది. నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం" అని చెప్పడంతో ఆయన నిర్ఘాంతపోయారు. "గత ఏడాది క్యాంటీన్లోనే 1,200 డాలర్లు(దాదాపు రూ. 1.14 లక్షలు) ఖర్చు చేశాను. ఏడాదికి రూ.1.9 కోట్లు సంపాదించే నేను, కేవలం రూ.186 కుకీ కోసం దొంగతనం చేస్తానా?" అని ఆయన ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలని యూనియన్ ప్రతినిధి సూచించినా, చేయని తప్పుకు క్షమాపణ చెప్పేది లేదని క్రోమ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను బలవంతంగా ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపించారు.నిజాయతీని నిరూపించుకుని..ఈ అవమానంతో కుంగిపోని క్రోమ్,