
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రావలకోట్లోని ఈద్గా మైదానంలో గురువారం నాటి నిరసన ప్రదర్శనలు 24వ రోజుకు చేరుకున్నాయి.
ఈ మహాధర్నాకు దాదాపు 80,000 మందికి పైగా స్థానిక ప్రజలు తరలివచ్చారు. ప్రాథమిక హక్కుల సాధన కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఇస్లామాబాద్ (పాక్ ప్రభుత్వం) నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటుగా మారింది. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన అబద్ధాలను స్థానిక నేతలు ఇక్కడి వేదికల నుంచే బయటపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.ఈ నిరసనల్లో భాగంగా 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (జేఏఏసీ) అధినేత సర్దార్ అమన్ ఖాన్ చేసిన సంచలన ప్రసంగం ఇప్పుడు పాకిస్థాన్ రక్షణ వర్గాలను వణకిస్తోంది. సరిహద్దుల్లోని కశ్మీరీలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది స్వయంగా పాకిస్థాన్ సైన్యమేనని ఆయన బహిరంగంగా వెల్లడించారు."కశ్మీరీల చేతులకు తుపాకులు అందించింది పాకిస్థాన్ సైన్యమే. కానీ ఈ రోజు వాళ్లే మమ్మల్ని ఉగ్రవాదులు అని పిలవడానికి ఎంత ధైర్యం?" అని సర్దార్ అమన్ ఖాన్ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనకారుల నుండి పెద్ద ఎత్తున చప్పట్లు, మద్దతు లభించింది.జైష్-ఎ-మహమ్మద్ ర్యాలీపై ప్రశ్నలుగత ఏడాది ఫిబ్రవరిలో రావలకోట్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ 'జైష్-ఎ-మహమ్మద్' నిర్వహించిన ఒక బహిరంగ ర్యాలీని అమన్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ రోజు ఉగ్రవాదులు ఏకే-47 తుపాకులు, కత్తులతో నడిరోడ్లపై యథేచ్ఛగా ఊరేగారని.. ఆ కార్యక్రమానికి రావలకోట్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా