
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఆమె ప్రియుడు, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ తమ వివాహానికి ముందు గొప్ప మనసును చాటుకున్నారు. తమ పెళ్లి వేడుకల సందర్భంగా అమెరికాలోని సుమారు
20 స్వచ్ఛంద సంస్థలకు ఏకంగా 26 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 247 కోట్లు) విరాళంగా అందించి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో వీరి వివాహ వేడుకలు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ భారీ విరాళాల ప్రకటన వెలువడింది.ఈ విరాళాల విషయాన్ని ఈ జంట పబ్లిసిస్ట్ అధికారికంగా ధ్రువీకరించారు. టేలర్, కెల్సీలకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న ప్రాంతాలైన న్యూయార్క్, కాన్సాస్ సిటీ, రోడ్ ఐలాండ్, పెన్సిల్వేనియా వంటి నగరాల్లోని సంస్థలకు ఈ సాయం అందించారు. వీరి విరాళాలు అందుకున్న వాటిలో ఫుడ్ బ్యాంక్ ఫర్ ఎన్వైసీ, సిటీ హార్వెస్ట్, చిల్డ్రన్స్ మెర్సీ హాస్పిటల్, డాలీ పార్టన్ ఇమాజినేషన్ లైబ్రరీ, ఏఎస్పీసీఏ, ఫీడింగ్ అమెరికా వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఒక్క న్యూయార్క్‌లోనే 9 సంస్థలకు ఈ జంట అండగా నిలిచింది.ఈ జంట అందించిన విరాళాలపై ఆయా సంస్థలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమకు 2 మిలియన్ డాలర్లు అందాయని ఫీడింగ్ అమెరికా తెలుపగా, సిటీ హార్వెస్ట్, రోడ్ ఐలాండ్ కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ సంస్థలు చెరో 1 మిలియన్ డాలర్ల విరాళాన్ని ధ్రువీకరించాయి. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలుస్తున్న తమకు సాయం అందించినందుకు 'ఆన్సర్ ది కాల్' అనే సంస్థ