కేశవను బుస్సు అంటూ కన్నా ఆటపట్టిస్తుంటాడు. ఈ బుస్సు ఏంట్రా అని పెద్ది అంటాడు. అదే టైంలో ఒకే ఆటోలోంచి చక్రి, మహా దిగుతారు. పులి మేక కలిపి వస్తున్నారేంటి.. అని కేశవ అంటాడు.
ఇద్దరి మొహాల్లో సంతోషం లేదు కదా.. డేటింగ్‌కి వెళ్లి ఉంటారేమో అని కన్నా అంటాడు. ఈ డేటింగ్ అంటే ఏంట్రా అని పెద్ది అంటాడు. నేను చెప్తా అని ఆవేశంగా అంటాడు కేశవ.. అంతలోనే నాక్కూడా తెలీదు అని ఆగిపోతాడు. బుస్సు, ముంగీస కలిసి చేస్తున్నది కూడా డేటింగే అని అంటాడు కన్నా. ప్రేమలో ఉన్న వాళ్లు అలా బయటకు వెళ్లి కలిసి రావడమే డేటింగ్ అని కన్నా అంటే.. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయ్ రా అని పెద్ది అంటాడు. ఈ వయసులో ఇలాంటివి తెలియకపోతేనే డాక్టర్ దగ్గరకు పోవాలని కన్నా కౌంటర్లు వేస్తాడు. ఇక చక్రి డల్‌గా ఉన్నది చూసి.. కన్నా, కేశవ కౌంటర్లు వేస్తారు. మరో వైపు శైలుని ఇంట్లో వాళ్ల తండ్రి ప్రశ్నలు అడుగుతుంటాడు. ప్రతీ దానికి సమాధానాలు చెబుతూనే ఉంటుంది శైలు. ఎలా అడగాలి అని మథన పడుతుంటాడు శైలు తండ్రి. ఇన్ని అడుగుతున్నాడేంటి.. కొంపదీసి కేశవతో చూసి ఉంటాడా? అని శైలుకి అనుమానం వస్తుంది.మా బాస్‌కి చెప్పాను మా బాస్, నా ఫ్రెండ్ దివ్య వస్తారు.. ఈ ఇంటి మీద రీసెర్చ్ చేస్తున్నాం.. అని మహా చెబుతుంది. ఈ ఇంటికి వస్తే మీ పరువే పోద్ది అని కేశవ అంటాడు. అన్నీ ముందే చెప్పా.. స్టే ఆర్డర్ ఉంది.. అందుకే ఇంటిని రెనోవెట్ చేయలేదు.. అని మా బాస్‌కి చెప్పాను అని మహా అంటుంది. సరే ఎంత మందిని అయినా తీసుకు రా.. అందరికీ వంట చేసి పెడతాను అని పెద్ది అంటాడు. అందరికీ అందరూ బాగానే ఉన్నారు.. నన్ను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చక్రి లోలోపల అనుకుంటాడు. రాత్రి పడుకునే టైంలో ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉంటారు. అలారం పెట్టురా అని కేశవకు పెద్ది చెబుతాడు.ఆరు నెలల్లో వాలెంటైన్స్ డే నా బతుకే గందరగోళంగా ఉంది రా అని చక్రి అంటాడు. ఏం జరిగింది రా అని పెద్ది అడుగుతాడు. మీకు నా బాధ చెప్పినా వేస్టే.. మీరేం తీర్చరు.. రెస్టారెంట్‌కి తీసుకు వెళ్లి విడాకులు అడిగింది.. అని చక్రి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వు రాత్రి తాగి అలా వచ్చావ్.. అందుకే ఇలా అడిగిందని పెద్ది అంటాడు. మన ఇంటి మీద నిందలు పడుతున్నాయ్.. అని మాత్రమే వచ్చింది అని పెద్ది చెబుతాడు. విడాకులు ఇవ్వను.. ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తా.. ఇంకో ఆరు నెలల్లో వాలెంటైన్స్ డే వస్తుంది.. కదా.. తనే నాకు ప్రపోజ్ చేసేలా చేస్తా అని చక్రి అనడంతో.. అందరూ కామెడీగా చూస్తారు.మా లక్కీ.. లక్కీనే ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేస్తాడు పెద్ది. ఇక ఇంతలోనే విక్కీ, దివ్య కూడా వస్తారు. ఇక లక్కీ అని విక్కీ పిలవడంతో చక్రి కుళ్లుకుంటాడు. లక్కీ, విక్కీ.. పీక నొక్కి.. అని చక్రి లోలోపల అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఇంటికి 120 ఏళ్ల వయసు ఉంటుందని, ఇంటి విశేషాల గురించి పెద్ది చెబుతాడు. ఇక విక్కీ, దివ్యకు ఇల్లంతా చూపిస్తుంది మహా. మా బాస్ మాకు ఆఫీసులో కాఫీ ఇస్తుంటాడు.. మీకు ఇక్కడ పెద్ది టీ ఇస్తున్నాడు.. ఇంత మంచి టీ అంటే మా లక్కీ.. లక్కీనే అని విక్కీ అంటాడు. అసలు ఇంతకీ ఇతను (చక్రి) నీకు ఏం అవుతాడు అని మహాని విక్కీ అడుగుతాడు. కజిన్ అని సమాధానం చెప్పడంతో కన్నా, కేశవ నవ్వుకుంటారు.చక్రి శపథం.. కజిన్ అంటే అన్నయ్యే అని కాదు.. బావ కూడా లే అని కన్నా చెప్పడంతో చక్రి కూల్ అవుతాడు. ఇక మేం వెళ్తాం.. మళ్లీ మా లక్కీతో వచ్చినప్పుడు తింటాను లే అని పెద్దికి చెప్తాడు. కారు ఎక్కి వెళ్లే టైంలోనూ చక్రి వెనక డోర్ తీస్తాడు. దివ్య థాంక్స్ చెప్పి ఎక్కేస్తుంది. మహా ముందు సీటులో కూర్చుంటుంది. దీంతో అక్కడా బిస్కెట్ అయ్యాడని చక్రిని చూసి కేశవ, కన్నా నవ్వుకుంటారు. కజిన్ అని పరిచయం చేసింది ఏంటి అని పెద్దికి తన కష్టం చెప్పుకుంటాడు చక్రి. ఎప్పటికీ నిన్ను భర్తలా అంగీకరించదు అని కేశవ అనడంతో.. చక్రి కోపం.. వచ్చే వాలెంటైన్స్ డే లోపు తనను పడేస్తా.. భర్తగా అనిపించుకుంటా అని శపథం చేసి వెళ్లిపోతాడు.అడ్డంగా బుక్కైన కేశవ, శైలు.. ఇంకో వైపు శైలు మెకానిక్ షాప్ వద్ద వెయిట్ చేస్తుంటుంది. అమ్మ బిర్యానీ అడిగితే చేయలేదు.. అందుకే కోపంగా ఉన్నాను, చివరకు పెట్టింది లే అని శైలు అంటుంది. అయితే శైలు నవ్వకుండా కోపంగానే ఉండటంతో.. తనను నవ్వించేందుకు చెక్కిలిగింతలు పెడతాడు కేశవ. ఇక ఆ ఇద్దరూ అంత క్లోజ్‌గా నవ్వుతూ ఉండటాన్ని శైలు ఫాదర్ చూస్తాడు. నడి రోడ్డుపై నిల్చుని శైలు.. అని గట్టిగా అరిచేస్తాడు ఆ తండ్రి. దీంతో శైలు కంగారు పడుతుంది. ఎవరు ఆయన అని కేశవ అంటే.. మా నాన్న అని శైలు అంటుంది.ప్రేమించడానికి మెకానిక్ ఏ దొరికాడా? ఇక శైలుని ఇక్కడ ఉన్నావ్ ఏంటి అని అడిగితే.. విద్య, స్కూటీ అని ఏదేదో చెబుతుంది. దీంతో విద్యకు ఫోన్ చేస్తే.. ల్యాబ్‌లోనే ఉందని అబద్దం చెబుతుంది. దీంతో శైలుని లాగి పెట్టి కొడతాడు తండ్రి. నీకు ప్రేమించడానికి ఈ మెకానిక్ ఏ దొరికాడా? అని తిడతాడు. దీంతో శైలుకి కోపం వస్తుంది. నేను నీ కూతుర్ని.. నన్ను ఏమైనా తిట్టు.. అతడ్ని మాత్రం ఏమీ అనకు.. నేనే అతడ్ని ప్రేమించాను.. అని శైలు అంటుంది. వ్యవహారం అంత వరకు వచ్చిందా? ఇంటికి వెళ్దాం పదా అని శైలుని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ శైలు మాత్రం తర్వాత వస్తాను వెళ్లండి నాన్నా అని అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.