
బ్యాంకాక్: ఈశాన్య థాయిలాండ్‌లో కాలినడకన తీర్థయాత్రకు బయల్దేరిన బౌద్ధ భిక్షువులను మృత్యువు ఒక ట్రక్కు రూపంలో వచ్చి కబళించింది. 11 ఏళ్ల బాలుడు ట్రక్కును నడిపి అమాంతం బౌద్ధ భిక్షువుల మీదకు పోనిచ్చాడు.
Jul 3 2026 5:45 AM | Updated on Jul 3 2026 5:45 AM
బ్యాంకాక్: ఈశాన్య థాయిలాండ్‌లో కాలినడకన తీర్థయాత్రకు బయల్దేరిన బౌద్ధ భిక్షువులను మృత్యువు ఒక ట్రక్కు రూపంలో వచ్చి కబళించింది. 11 ఏళ్ల బాలుడు ట్రక్కును నడిపి అమాంతం బౌద్ధ భిక్షువుల మీదకు పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయాలతో 9 మంది భిక్షువులు ప్రాణాలు కోల్పోయారు. ముక్దహాన్ ప్రావిన్స్‌లోని ఆలయం నుంచి 260 కిలోమీటర్ల దూరంలోని రాట్చథానీ ప్రావిన్స్‌లోని మరో ఆలయానికి 34 మంది భిక్షువులు, ఐదుగురు శిష్యుల బృందం కాలినడకన తీర్థయాత్రకు బయల్దేరింది.
మార్గమధ్యంలో ఒక రహదారి పక్కన నడుస్తుండగా 11 ఏళ్ల బాలుడు పికప్ ట్రక్కును నడుపుతూ వచ్చి నేరుగా వీళ్ల మీదకు పోనిచ్చాడు. ట్రక్కు అత్యంత వేగంగా ఢీకొనడంతో ఐదుగురు భిక్షువులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కన్నుమూశారు. 22 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)
పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)
క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ