
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏటా పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన చట్టాన్ని ఏడాదిలోనే అటకెక్కించింది.
Jul 3 2026 6:04 AM | Updated on Jul 3 2026 6:04 AM
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏటా పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన చట్టాన్ని ఏడాదిలోనే అటకెక్కించింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చిన తర్వాతే చట్టప్రకారం బదిలీలు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం సర్దుబాటు పేరుతో బదిలీలు చేస్తోంది. జిల్లాల పునరి్వభజన నేపథ్యంలో ఇతర అన్ని ప్రభుత్వశాఖల్లోనూ పదోన్నతులు కల్పిస్తుండగా.. విద్యాశాఖలో మాత్రం అలాంటి ప్రక్రియ ఏదీ చేపట్టకుండానే సర్దుబాటుకు తెరదీశారు.
గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం–2025 తెచ్చిన ప్రభుత్వం దాదాపు 68 వేలమందిని బదిలీ చేసింది. వీరిలో నాలుగువేల మందికి పదోన్నతులు కల్పించారు. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమై పక్షంరోజులు దాటినా పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టప్రకారం ఈ ఏడాది ఐదువేల నుంచి ఆరువేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు రావాల్సి ఉంది.
ఇందులో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 మంది చొప్పున మొత్తం 3,900 మంది ఉన్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్–2 హెడ్మాస్టర్లుగా మరో 800 మంది నుంచి 1,100 మంది ఉన్నట్టు అంచనా. పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు వస్తాయని, తాజా పరిణామాలతో వారంతా నష్టపోతున్నారన్న ఆందోళన టీచర్లలో వ్యక్తమవుతోంది.
సర్దుబాటుతోనే సరి.. గత ఏడాది దాదాపు 48 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు పేరుతో పీఎస్ హెచ్ఎంలుగా బదిలీ చేసినా.. వారికి హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వలేదు. అలాగే హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో దాదాపు 1,200 వరకు ఖాళీలున్నాయి. 1,136 సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు, 1,124 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను సృష్టించిన ప్రభుత్వం ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వలేదు, అలాగే అర్హత గల వారికి పదోన్నతులు కూడా ఇవ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
బీచ్లో బిగ్బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)
పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)
క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ