
ఇంటర్నెట్‌డెస్క్: ఒక జంట తమ ప్రేమకు గుర్తుగా ప్రమాదకర స్టంట్ చేసింది. న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ టవర్ పై భాగానికి ఎక్కి.. ఎంగేజ్మెంట్ చేసుకుందా జంట (Empire State Proposal).
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో వారిద్దరూ కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే..
రష్యన్ జంట ఇవాన్, ఏంజెలా నికోలవ్ తమ ప్రేమను మరోమెట్టుకు ఎక్కించేందుకు ఎంపైర్స్టేట్ భవనం టవర్ ఎక్కారు. 443 మీటర్ల ఎత్తులో ఏంజెలాకు ఇవాన్ ప్రపోజ్ చేశాడు. 10 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. నల్లని దుస్తులు ధరించిన వారిద్దరూ.. అదే రంగులో ఒక బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘అధికార దాహాన్ని ప్రేమకున్న శక్తి అధిగమించినప్పుడు ప్రపంచంలో శాంతి విలసిల్లుతుంది’ అని దానిపై రాశారు. ఆ వీడియో దృశ్యాలు అత్యంత ప్రమాదకరంగా కనిపించాయి. ఈ నిర్లక్ష్యానికి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భవనంపై నుంచి కిందికి రాగానే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రష్యాకు చెందిన వీరు న్యూజెర్సీలో నివసిస్తున్నారు. 2024లో వచ్చిన ‘స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ’ స్ఫూర్తితో ఈ స్టంట్ చేసినట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిస్పందనగా అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. కొన్నిగంటలపాటు క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. రాజధాని నగరం కీవ్‌లో భారీ పేలుళ్లు వినిపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ ఫొటోలు..