అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా రిలీజుకు రెడీ అయింది. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
ఇటీవలే వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. తిరుపతిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరోవైపు అఖిల్ కూడా రంగంలోకి దిగారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమాకి సంబంధించిన విషయాలతో పాటుగా పలు ఆసక్తికరమైన సంగతులను పంచుకున్నారు.అఖిల్ చివరగా 2023 సమ్మర్ సీజన్ లో ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇది బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశ పరిచింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ‘లెనిన్’ సినిమాతో అలరించడానికి వస్తున్నారు అఖిల్. ఇంత గ్యాప్ తీసుకోడానికి కారణం.. లాస్ట్ మూవీ డిజాస్టర్ గా మారడమే కారణమని అందరూ అనుకున్నారు. దీంతో అక్కినేని అభిమానులు సైతం నిరాశ చెందారు. పరాజయం నుంచి వీలైనంత త్వరగా కోలుకొని, వెంటనే మరో చిత్రాన్ని పూర్తి చేయాలని కోరుకున్నారు. అయితే మూడేళ్లు విరామం తీసుకోవడానికి గల అసలు కారణాన్ని అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.* ‘రంగస్థలం’ ఇప్పుడు విడుదలైతే ‘పుష్ప’లాగే ఇండియాని షేక్ చేసేది: అఖిల్ అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు అఖిల్ మాట్లాడుతూ.. “మూడేళ్లు అనేది చాలా లాంగ్ బ్రేక్. ఫ్యాన్స్ ఫస్ట్రేషన్ ను నేను అర్థం చేసుకోగలను. అందులో సగం నా ఫాల్ట్ ఉంటే, మిగతా సగం నా చేతుల్లో లేకుండా పోయింది. నాకు దెబ్బ తగిలి, రికవరీ అవ్వడానికి 16 నెలలు పట్టింది. ‘ఏజెంట్’ సినిమా రిలీజైన మూడు నాలుగు నెలలకు నేను ప్రమాదవశాత్తు బాత్రూం ఫ్లోర్ మీద జారి పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయి. చేతి నరాలు కట్ అయ్యాయి. ఎడమ చేతి వేళ్లకు రెండు మైక్రో సర్జరీలు జరిగాయి. 48 కుట్లు పడ్డాయి. ఇది చాలా పెద్ద కథ. 8 నెలల పాటు బరువులు ఎత్తలేకపోయాను. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి, మెంటల్ గా రికవరీ అవ్వడానికి 16 నెలలు పట్టింది. జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేయడానికి, యాక్షన్ చేయడానికి టైమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా మరోసారి జరగదని ఫ్యాన్స్ కి నేను హామీ ఇస్తున్నాను’’ అని అన్నారు.అఖిల్ తన చేతికి సర్జరీలు జరిగాయని చెప్పడంతో.. హ్యాండ్ కి కట్టుకొని 'సలార్' సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇకపోతే మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్.. 'లెనిన్' తర్వాత ఎక్కువ విరామం తీసుకోకుండా తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేస్తానని తెలిపారు. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ ప్రాసెస్ లో ఉన్నాయని, రెండు నెలల్లో ఒక మూవీని ప్రకటిస్తానని తెలిపారు. సెప్టెంబర్ లో అప్డేట్ ఉండొచ్చని వెల్లడించారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉండటంతో, అదే రోజున అయ్యగారి నెక్స్ట్ మూవీని అధికారికంగా ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు. మహాభారతంతో లెనిన్.. అఖిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా! * అఖిల్ నటనకు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫిదా.. ‘లెనిన్’ ట్రైలర్‌పై ప్రశంసలు..ఇక 'లెనిన్' విషయానికొస్తే.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.