
సాయికృష్ణ మృతి కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును 8 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10 వరకు ఆయన్ను రాజమహేంద్రవరం జైలులో విచారించేందుకు అనుమతి ఇచ్చింది
. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సూచించింది. న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డులతో విచారణ జరపాలని.. అనంతరం వాటిని న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో నాగరాజు ఇప్పటివరకు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. సాయికృష్ణ మృతి కేసు.. నాగరాజుకు పోలీసు కస్టడీ |