
తిరుమల: టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
గురువారం ఉదయం తిరుమలలోని కర్ణాటక భవన్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు డా.వైష్ణవి, డా.హర్షవర్థన్ రెడ్డిలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.