రోజంతా పని చేసినప్పటికీ మీ పనులు పూర్తి అవ్వకపోవడం, సమయం సరిపోవడం లేదని మీకు అనిపిస్తే కచ్చితంగా లైఫ్‌స్టైల్ మార్చుకోవాలి.
ఇంట్లో అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటి వాతావరణాన్ని మార్చుకోవాలి.
చిన్న సమస్యలు కూడా భారంగా అనిపిస్తున్నట్లయితే కచ్చితంగా మీరు మీ జీవన విధానాన్ని మార్చుకోవడం మంచిది.
అన్ని పనులను వాయిదా వేయడం, మీరు చేయాల్సిన పనుల జాబితా పెరుగుతూనే ఉంటున్నట్లయితే జీవనశైలి మార్చుకోండి. పనుల ప్రాధాన్యతల విషయంలో కాస్త మార్పు చేయాలి.
నిత్యం బిజీగా ఉండటం, ఏదో ఒక విషయం కోసం ఎప్పుడూ పరుగులు పెడుతున్నట్లు ఉంటే మీ షెడ్యూల్‌ను కాస్త తేలికగా మార్చుకోండి.
అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మీ ఖర్చులను గమనించి మార్పులు చేసుకోవడం మంచిది.
సోషల్ మీడియా వంటి వాటితో మీరు ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లయితే జీవనశైలి మార్చుకోండి.
సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, చిన్న నిర్ణయాలు తీసుకోవడం కూడా కష్టంగా మారడం వంటివి మీలో ఉంటే వెంటనే జీవనశైలిని మార్చుకోండి.
విశ్రాంతి తీసుకున్నప్పటికీ అలసట తగ్గకపోతే మీ లైఫ్‌స్టైల్ సరిగా లేదని అర్ధం.