అక్కినేని వారసుడు అఖిల్ ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. చివరగా ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్..
మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుఈసారి సాలిడ్ హిట్ కొడతాననే నమ్మకంతో వస్తున్నారు. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. మరోవైపు అఖిల్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తూ సినిమాకి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘లెనిన్’ లాంటి కథ ఇంతవరకూ తాను వినలేదని, బిగ్ స్క్రీన్ మీద అలాంటి సినిమా చూడలేదని అన్నారు. స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పారు. కథ విన్న వెంటనే ఇది చేయాలని ఫిక్స్ అయ్యానన్నారు. ఈరోజుల్లో థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తేనే కమర్షియల్ సినిమా అవుతుందని, అలాంటి చిత్రాలే మంచి కలెక్షన్స్ రాబడతాయనేది తన ఉద్దేశ్యమని అఖిల్ పేర్కొన్నారు. బిగ్గెస్ట్ సూపర్ స్టార్లను పక్కన పెడితే.. యంగ్ స్టార్ హీరోలు మాత్రం ఫ్రెష్ కంటెంట్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని అన్నారు. టికెట్ కొనుక్కొని థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు కొత్తదనం కోరుకునే హక్కు ఉందని, ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే వాళ్లకు నచ్చుతుందని అఖిల్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ‘లెనిన్’ కూడా అలాంటి ఒక సినిమానే అని, స్క్రిప్ట్ విన్నప్పుడే తనకు కొత్తగా అనిపించిందని, థియేటర్లో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని అన్నారు. ఈరోజుల్లో మనం ఎలాంటి సినిమా చూపిస్తున్నామో ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చెయ్యాలని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా, వాళ్ల అంచనాలను అందుకునే సినిమా ఇవ్వాలని అఖిల్ పేర్కొన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రధాన పాత్రలన్నీ చూపిస్తూ, ఎలాంటి సినిమా అనేది తెలిసేలా ‘లెనిన్’ ట్రైలర్ కట్ చేసినట్టు తెలిపారు.* ‘లెనిన్’ ట్రైలర్.. అఖిల్ నటనకు మహేష్ బాబు, రామ్ చరణ్ ప్రశంసలు ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకులు తీసిన సినిమాల నుంచి తాను స్పూర్తి పొందుతానని అఖిల్ చెప్పారు. “ఉదాహరణకు ‘రంగస్థలం’ సినిమాని తీసుకుంటే.. ఫిలిం మేకింగ్ లో రంగస్థలంకి ముందు రంగస్థలం తర్వాత అని నాకు అనిపించింది. సుకుమార్ నాన్ కమర్షియల్ విధానంలో సినిమాను రూపొందించారు. హీరోకి వినికిడి లోపం ఉంటుంది. సగం సీన్లలో హీరోనే ప్రాబ్లమ్ అవుతాడు. కానీ ఒక అద్భుతమైన సినిమాగా తీర్చిదిద్దారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎపిక్ చిత్రాల్లో ‘రంగస్థలం’ ఒకటి. ఒకవేళ ‘రంగస్థలం’ ఈరోజు విడుదలై ఉంటే, ‘పుష్ప’ లాగే మొత్తం ఇండియాని షేక్ చేసి ఉండేదని నాకు అనిపిస్తుంది” అని అఖిల్ అన్నారు. ‘రంగస్థలం’తో పాటుగా KGF, ‘యానిమల్’ లాంటి సినిమాలు కూడా తనకు స్పూర్తినిచ్చాయన్నారు. మహాభారతంతో లెనిన్.. అఖిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా!ఈరోజుల్లో స్టార్ హీరోలు కూడా కొత్త కథల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, క్యారెక్టర్ కు తగ్గట్టుగా ట్రాన్స్ ఫామ్ అవుతున్నారని అఖిల్ అన్నారు. “పెద్ది’ సినిమా తీసుకుంటే రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ లోకి మారిపోయాడు. మనకు చరణ్ కనిపించలేదు. పెద్ది పాత్ర మాత్రమే కనిపిస్తుంది” అని చెప్పారు. ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో సినిమాలు తీసే స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, యంగ్ యాక్టర్స్ మాత్రం ఫ్రెష్ కంటెంట్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు. అందరూ ‘నా సినిమాతోనే నిన్ను మెప్పిస్తా.. నా స్టార్ డమ్ తో కాదు’ అనే విధంగా ముందుకు సాగుతున్నారన్నారు. ‘లెనిన్’ సినిమా తప్పకుండా ఒక కొత్త అనుభూతిని పంచుతుందని, ఇది సాఫ్ట్ సినిమా అయితే కాదని, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని అఖిల్ చెప్పుకొచ్చారు.