జాతక చక్రంలో గ్రహాల స్థానాల ఆధారంగా జ్యోతష్య యోగాలు ఏర్పడతాయి. శాస్త్రాలు ఐదు ప్రత్యేకమైన ‘పంచమహాపురుష రాజయోగాల’ను పేర్కొన్నాయి.
అందులో మొదటిది రుచక, రెండోది భద్ర, మూడోది హంస, నాలుగోది మాళవ్య, ఐదోది శశక యోగాలు. రుచక యోగానికి కుజుడు, భద్ర యోగానికి బుధుడు, హంస యోగానికి గురుడు, మాళవ్య యోగానికి శుక్రుడు, శశక యోగానికి శని గ్రహాలు ప్రధానమైనవి జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి జాతకంలో ఈ పంచమహాపురుష రాజయోగాలలో కనీసం ఒకటి ఉన్నా వారికి జీవితంలో అద్భుతమైన విజయాలు లభించే అవకాశం ఉంది. వారు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ రెండు యోగాలు ఉంటే, ఆ వ్యక్తి రాజాలాంటి విలాసాలు, మంచి వస్త్రధారణ, సౌకర్యాలతో పాటు భౌతిక సుఖాలను అనుభవించొచ్చు. అదే మూడు యోగాలు ఉంటే అలాంటి వ్యక్తులు రాజు స్థాయిని పొందుతారు. వీరు రాజభోగాలను అనుభవిస్తూ, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ, చివరికి పరమ ఆధ్యాత్మిక ఆనందాన్ని(బ్రహ్మానందాన్ని) పొందుతారు.
ఒకవేళ జాతకంలో నాలుగు పంచమహాపురుష రాజయోగాలు ఉంటే వారు ఏదైనా సామ్రాజ్యానికి చక్రవర్తి(సార్వభౌమాధికారి) అయ్యే అవకాశం ఉందని ప్రాచీన జ్యోతిష్యగ్రంథాలు చెబుతున్నాయి. వీరు లౌకిక కార్యకలాపాల నుంచి వైదలొగి పరమానందాన్ని పొందుతారు. ఉదాహరణకు మేష లగ్నంలో జన్మించిన వ్యక్తిని తీసుకుంటే మేషం, కర్కాటకం, తులా, మరియు మకర రాశులు కేంద్ర స్థానాలలో (అంటే 1,4,7, 10వ భావాలలో) ఉంటాయి. కుజుడు తన సొంతరాశి మేషంలోనూ, గురుడు ఉచ్ఛ స్థితిలో(కర్కాటక రాశిలోనూ) శుక్రుడు తన సొంత రాశి తులా రాశిలోనూ, శని తన సొంత రాశి అయిన మకరంలో ఉంటే, ప్రత్యేక బలాన్ని కలిగి కేంద్ర స్థానాల్లో ఉన్న ఈ నాలుగు గ్రహాలు నాలుగు పంచమహాపురుష యోగాలను ఏర్పరచనున్నాయి.
ఈ జ్యోతిష్య యోగాల ఆవిర్భావం, ఆనంద ప్రాప్తి అనేవి గత జన్మల కర్మలపై ఆధారపడి ఉంటాయి. పైన పేర్కొన్న ‘పంచ మహాపురుష యోగాలు’ ఏవీ లేనంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఉత్తమ విద్య, విలువలను పొందడంతో పాటు ‘గజకేసరి యోగం’, ‘బుధాదిత్య యోగం’వంటి యోగాలు(ఇవి పంచ మహాపురుష యోగాల కంటే తక్కువ అయినప్పటికీ) ఒక వ్యక్తిని సంతోషకరంగా, గౌరవప్రదంగా జీవించేలా చేయగలవు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు. వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు. సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి