
లిఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లిఫ్ట్ రాకుండానే డోర్ తెరుచుకోవడంతో ముందుకు అడుగు వేసిన వృద్ధురాలు అమాంతం కిందపడిపోయారు. దాని కింద నలిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటన విశాఖ ఊర్వశి జంక్షన్ వద్ద ఓ అపార్ట్మెంట్లో బుధవారం వెలుగుచూసింది. లిఫ్ట్ పని చేయకపోవడంతో అపార్ట్మెంట్ నిర్వాహకులు బుధవారం ఉదయం మెకానిక్‌ను పిలిపించారు. ఆయన తలుపు తీసి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా తీవ్ర దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త చదివారా: చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. జర్నలిస్ట్ కేవీఆర్‌కు రిమాండ్