
వరల్డ్ కప్‌లో రాణించిన హీరోలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిలో భరోసా నింపడం మా బాధ్యత. అలా చేయడం వల్ల రాబోయే టోర్నీల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారు.
ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు టీ20 మ్యాచ్ ఎలా ఆడాలో తెలుసు - ఇదీ ఇంగ్లాండ్‌తో తొలి టీ20కు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు.
అవును కొత్త సారథి శ్రేయస్ (Captain Shreyas Iyer) మాటల్లో కొంత నిజమూ ఉంది. ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ప్లేయర్లను పక్కన పెట్టడం సరైంది కాదు. కానీ, సదరు ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే? ఏం చేయాలనే దానిపైనా ఓ స్పష్టత ఇస్తే బాగుండేది. మరోవైపు తనకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని ఓ లిటిల్ ఛాంపియన్ కాచుకుని ఉన్నాడు. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఇది ఎవరి గురించో? సింగిల్ డిజిట్‌కే పరిమితమై విమర్శలు ఎదుర్కొంటున్న సంజు శాంసన్ ఓ పక్క.. కేవలం 15 ఏళ్లకే హేమాహేమీల బౌలింగ్‌ను తుత్తనీయలు చేసిన వైభవ్ సూర్యవంశీ మరో వైపు పోటీలో ఉండటంతో మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిపోయింది.
టీమ్ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గడంలో సంజు శాంసన్ (Sanju Samson)దే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అతడే. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. గత ప్రపంచ కప్‌లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. ఒకదశలో ఇలాంటి టాలెంట్ ప్లేయర్‌ను ఎందుకు పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం వరుస మ్యాచుల్లో విఫలమైన అతడిని ఎందుకు ఇంకా ఉంచారు? అనే ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. ఐర్లాండ్‌పై 5, 0.. ఇప్పుడు వర్షం కారణంగా మధ్యలోనే రద్దు అయిన ఇంగ్లాండ్‌పై తొలి టీ20లో కేవలం ఒక్క పరుగే చేశాడు.
గతంలోనూ చాలా మంది విఫలమయ్యారు కదా.. అప్పుడెవరూ ఎందుకు మాట్లాడలేదు? అనే కామెంట్లు వస్తున్నాయి. ఇక్కడ సంజును పక్కన పెట్టమనడానికి అతడి మీద కోపం కాదు.. వైభవ్ (Vaibhav Sooryavanshi) అనే చిచ్చర పిడుగు ఆటను అంతర్జాతీయ వేదికపై చూద్దామనే అభిమానుల ఆకాంక్ష. అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగే అతిపిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డు అతడి కోసం వేచి చూస్తోంది. మరోవైపు అతడు మాత్రం తన ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి.
ఒకప్పుడు వరుసగా విఫలమైనా.. ఈసారి ఆడతాడులే అనే కాస్త కనికరం చూపేవాళ్లు. ఇటు మేనేజ్మెంట్ లేదా అటు అభిమానులైనా సరే మరో ఛాన్స్ ఇద్దామని భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పోటీ ఎక్కువైపోయింది. ఒకటీ లేదా రెండు మ్యాచుల్లో అంటే ఫర్వాలేదు కానీ.. అదే కొనసాగితే మాత్రం వేటు ఎదుర్కోక తప్పదు.
ఐర్లాండ్‌తో (India vs Ireland) భారత్ రెండు టీ20లు ఆడింది. బెల్ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఆ కొద్దిపాటి స్టేడియం కూడా ఫుల్‌గా మారిపోయింది. దానికి కారణం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో ఆ కుర్రాడి ఆటను ప్రపంచం మొత్తం చూసింది. తాము కూడా ప్రత్యక్షంగా చూద్దామని ఐర్లాండ్ అభిమానులు భావించారు. కానీ, టీమ్ఇండియా మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ (India vs England) ఇదే పరిస్థితి. తొలి మ్యాచ్‌లోనూ చోటు కల్పించలేదు. డ్రెస్సింగ్ రూమ్ అలవాటు పడాలని చెబుతున్నా.. ఇలాంటి యువ డైనమేట్‌ను బరిలోకి దింపకపోతే ఎలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓపెనర్‌గా మూడు మ్యాచుల్లో విఫలమైన సంజు స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ ఎక్కువయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ ఫొటోలు మీకోసం..