
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికి కూడా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఎట్టకేలకు ఈ చిత్ర విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విజువల్ వండర్ చిత్రాన్ని దసరా కానుకగా 2026 అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. చిత్ర బృందం దీనిని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Nabha Natesh : రుద్రతో పార్వతి.. నభా నటేష్ క్యూట్ ఫోటోలు..
ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిష, ఆషికా కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఓ ప్రత్యేక గీతంలో నటించింది.