
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ పరిధిలో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణసేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన భూపోరాటం ఉద్రిక్తతకు దారితీసింది.
బోడుప్పల్లో ఉద్యమకారులతో కలిసి చేపట్టిన నిరసన కార్యక్రమంలో తోపులాట జరగడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అక్కడ వేసిన టెంట్లను తొలగించారు. అనంతరం కవిత సహా అక్కడున్న వారందరినీ అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్కు తరలించారు. మరోవైపు పీఎస్ ఎదుట కవిత మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వార్త చదివారా: అప్పులపై చర్చించేందుకు సిద్ధం.. ఇంకా బుకాయింపులు ఎందుకు?: మంత్రి జూపల్లి