
Coca Cola IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకాకోలా.. భారత్‌కు చెందిన తన బాటిలింగ్ యూనిట్ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పబ్లిక్ ఇష్యూకు (IPO)...
Coca Cola IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకాకోలా.. భారత్‌కు చెందిన తన బాటిలింగ్ యూనిట్ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పబ్లిక్ ఇష్యూకు (IPO) తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ నుంచి 1 బిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
వచ్చే వారం లండన్ వేదికగా ప్రజంటేషన్ ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోకాకోలాకు ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఉన్న రోత్స్చైల్డ్ అండ్ కో సంస్థ ప్రతిపాదిత ఐపీఓపై బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఐపీఓ సైజ్, ఇతర వివరాలపై త్వరలో స్పష్టత రానుంది. దీనిపై కోకాకోలా అధికారికంగా స్పందించలేదు.
ఇటీవల కాలంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ భారత అనుబంధ సంస్థలను ఐపీఓకు తీసుకొస్తున్నాయి. ఎల్జీ, హ్యుందాయ్ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూకు రాగా.. కోకాకోలా కూడా ఈ జాబితాలో చేరనుంది. కోకాకోలాకు భారత్ అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ లిమిటెడ్ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు 12 రాష్ట్రాల్లో 14 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. దాదాపు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 17 లక్షల రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.