
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) దర్శించుకున్నారు. గురువారం ఉదయం వైకుంఠ క్యూకాంప్లెక్సు వద్ద ఆయనకు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయంలోకి వెళ్లిన లోకేశ్.. శ్రీవారి తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేయగా.. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని తదితరులు స్వామివారిఇన దర్శించుకున్నారు. ఈ వార్త చదివారా: వాచీకి మళ్లీ టైమొచ్చింది!