
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Shani Nakshatra Gochar July 2026: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు తన నక్షత్ర సంచారం చేసింది.. జూలై 2, గురువారం రోజున శని నక్షత్ర సంచారం చేశాడు.. ప్రస్తుతం మీన రాశిలో సంచార దశలో ఉన్న.. శని దేవుడి నక్షత్ర మార్పు కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది కాబట్టి.. ఈ నక్షత్ర మార్పు ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. అయితే, విదేశీ ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తున్నవారు తప్పకుండా ఎంతో ఓపికగా ఉండడం చాలా మంచిది.
వృషభ రాశి: వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో శని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి: శని దేవుడి ఆశీస్సులతో వీరికి అదృష్టం కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆధ్యాత్మికంగా కూడా బోలెడు లాభాలు కలుగుఆయి..
సింహ రాశి: జ్యోతిష్యుల ప్రకారం.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది..
మిథున రాశి: శని ప్రభావంతో మిథున రాశివారికి ఉద్యోగ జీవితంలో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.. అయితే, కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశులవారికి ఆర్థిక పురోగతి.. తులా రాశి: శని ప్రభావంతో తులా రాశివారికి శత్రువులతో పాటు పోటీదారులపై అద్బుతమైన విజయం సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి.. అయితే, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఉంది..
ధనుస్సు రాశి: కుటుంబంతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాల్లో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి ఇది శుభ సమయంగా భావించవచ్చు. కుటుంబంలో కాస్త సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందరితో అద్భుతంగా మాట్లాడాల్సి ఉంటుంది..
వృశ్చిక రాశి: వృశ్చిక రాశివారికి వివిధ రంగాల్లో ఉన్న వారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. వీరు తప్పకుండా సంతానం గురించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి..
శని నక్షత్ర మార్పు ప్రభావంతో మీన రాశి వారికే అత్యధిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది.. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి..
మకర రాశి: కమ్యూనికేషన్‌తో పాటు నెట్వర్కింగ్ ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.