
తిరుమలలో భక్తుల రద్దీ కొనస్తాగుతోంది. వైకుంఠంలోని అన్నీ కంపార్ట్మెంట్లన్నీ నిండి 27 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది.
అయితే, ఈ నెల జూలై 14, 17వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ప్రధానంగా తరుమంజనం, అనివార ఆస్తానం సందర్భంగా ఈ రద్దు చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తిరుమలకు ఈ నెల వెళ్తున్నారా? అయితే, ముందుగానే ఈ విషయం తెసుకోండి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలకు శ్రీవారి భక్తులు దర్శించుకుంటారు. నిత్యం రద్దీ ఉంటుంది.
అయితే, తిరుమల భక్తులకు ముఖ్యమైన సమాచారం ఈనెల జూలై 14, 17 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనం (రికమండేషన్ లెట్టర్) ద్వారా చేశారు.
జూలై 14వ తేదీ కోయల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. జూలై 17వ తేదీ అనివార ఆస్తానం సందర్భంగా బంద్.
ఈ నేపథ్యంలో తిరుమలకు జూలై 14 దర్శనం సందర్భంగా ఇచ్చే రికమండేషన్ లెటర్స్ జూలై 13న ఇచ్చే రికమండేషన్ లెటర్స్ స్వీకరించరు.
జూలై 17వ తేదీ దర్శనం చేసుకునేవారికి జూలై 16న ఇచ్చే రికమండేషన్ లెట్టర్స్ తీసుకోరు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని ఈ మార్పులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
ఈ నేపథ్యంలో టీటీడీ అష్టాదళ పాద పద్మారాధన కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఆలయంలో ప్రత్యేక శుద్ధి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఆలయ సబ్బంది చేస్తారు. సర్వదర్శనం సేవలు యథావిధిగా కొనసాగుతాయి.